కర్నాటకలో చిరుతపులి కలకలం..స్కూళ్లకు సెలవులు

కర్నాటకలో చిరుతపులి కలకలం..స్కూళ్లకు సెలవులు

బెంగళూర్: కర్నాటకలోని బెళగావి సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దాంతో సోమవారం సిటీలోని 22స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. బెళగావి కంటోన్మెంట్ ఏరియాతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైమరీ, హైస్కూళ్లకు హాలీడే ఇచ్చారు. బెళగావిలోని జాదవ్‌‌‌‌నగర్‌‌‌‌లో ఓ భవన నిర్మాణ కార్మికుడిపై చిరుత దాడిచేసి గాయపర్చింది.ఈ విషయం కార్మికుడి తల్లి గుండెపోటుతో మృతి చెందింది.

చిరుత సంచారం పెరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చిరుత కారణంగా సెలవు ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. ఆగస్టు 8న కూడా 11స్కూళ్లను మూసివేశారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.