
పంజాగుట్ట, వెలుగు: ఈ నెల 9వ తేదీన పంజాగుట్ట నిమ్స్హాస్పిటల్క్లోజ్ ఉంటుందని, ఆ రోజు కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుతాయని హాస్పిటల్ఎగ్జిక్యూటివ్రిజిస్ట్రార్శాంతివీర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శివరాత్రి సెలవును 8 నుంచి 9వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు. పేషెంట్లు శుక్రవారం యథావిధిగా వైద్య సేవలు పొందవచ్చన్నారు. శని, ఆదివారాల్లో అత్యవర వైద్య సేవలు అందుతాయని, సోమవారం నుంచి పూర్తి స్థాయి సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.