
కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 30 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం సోమేష్ కుమార్ అధికారికంగా ప్రకటించారు . ఈ నెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది సర్కార్. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో సెలవులను పొడిగించాలని విద్యాశాఖకు వైద్య ఆరోగ్యశాఖ సిఫార్స్ చేసింది. దీంతో ఈ నెల 30 వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.