మరో బాంబ్ పేల్చిన ట్రంప్..విదేశీ సినిమాలపై 100 శాతం టారీఫ్

మరో బాంబ్ పేల్చిన ట్రంప్..విదేశీ సినిమాలపై 100 శాతం టారీఫ్

రెండోసారి అమెరికా అధ్యక్షడయ్యాక డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం తగ్గడం లేదు..రోజుకో సంచలన నిర్ణయంతో హడలెత్తిస్తున్నాడు.  ఇతర దేశాలపై ఆంక్షలు, టారీఫ్ లతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇప్పటి వరకు పలు దేశాలపై వాణిజ్యపరమైన విషయాల్లో మితిమీరిన   టారీఫ్ లు  వేసిన ట్రంప్..ఇపుడు సినీ ఇండస్ట్రీపై పడ్డాడు. 

విదేశీ సినిమాల వల్ల హాలీవుడ్ నష్టపోతుందని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అమెరికా బయట షూటింగ్ చేసి తమ దేశంలో రిలీజ్ చేసే అన్ని రకాల సినిమాలపై వంద శాతం పన్ను విధిస్తున్నట్లు సంచలన  ప్రకటన చేశాడు ట్రంప్.

Also Read : జాతి నిర్మాణం.. అత్యవసరం!

అమెరికాలోనే సినిమాలు తీయాలి..మేం అమెరికాలో తీసే సినిమాలనే కోరుకుంటాం.  ఇతర దేశాలు మా హాలీవుడ్ నిర్మాతలను,స్టూడియోలను అమెరికా నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం అన్ని రకాల ప్రోత్సహాకాలను అందిస్తున్నాయి. దీని వల్ల అమెరికాలోని ఇతర ప్రాంతాలు నష్టపోతున్నాయి. దీనిని జాతీయ భద్రతా ముప్పుగా పరిగణిస్తున్నాం. అందుకే విదేశాల్లో షూట్ చేసి  మా దేశంలో  రిలీజ్ చేసే సినిమాలపై 100 శాతం టారిఫ్ విధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశిస్తున్నా అని ట్రంప్ అన్నారు.