ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకుంటున్న హాలీవుడ్ డైరెక్టర్

ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకుంటున్న హాలీవుడ్ డైరెక్టర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందంటూ ఓ హాలీవుడ్ డైరెక్టర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతమని, అందుకే ఆయనతో సినిమా చేయాలని ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.  ఆ దర్శకుడు ఎవరో కాదు.. 'గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ' చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్.

ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తోన్న 'సూపర్ మ్యాన్ : లెగసీ' మూవీ  ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగంగానే  ఎన్టీఆర్ తో సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. "ఒకవేళ ఎవరైనా ఇండియన్ యాక్టర్స్ ని మీ గార్డియన్స్ ప్రపంచంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకి బదులుగా.. ఎన్టీఆర్ పేరు చెప్పారు జేమ్స్ గన్.'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఇంటర్వెల్ సీన్లో వ్యాన్ లోనుంచి పులులు, వన్య మృగాలతో ఎన్టీఆర్ దూకే సీన్ తనకు చాలా ఇష్టమని జేమ్స్ గన్ పేర్కొన్నారు.

ఇక 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ పాన్ వరల్డ్ లెవల్ కి పెరిగిన విషయం తెలిసిందే. అందుకే తన తరువాత సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో బాగంగానే  కొరటాల శివ సినిమా, ఆ తర్వాత 'వార్ 2' సినిమాని లైన్లో పెట్టాడు ఎన్టీఆర్.   హాలీవుడ్ డైరెక్టర్ చేసిన ఈ కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్  ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్  అంటూ కామెంట్స్ చేస్తున్నారు.