తెలంగాణలో13 మంది అడిషనల్ ఎస్పీలు బదిలీ

తెలంగాణలో13 మంది అడిషనల్ ఎస్పీలు బదిలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా13 మంది అడిషనల్‌‌‌‌ ఎస్పీ(నాన్‌‌‌‌ కేడర్‌‌‌‌)లను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్‌‌‌‌లో అడిషనల్‌‌‌‌ ఎస్పీగా పనిచేస్తున్న జి. వెంకటేశ్వర బాబును ఎక్సైజ్‌‌‌‌ శాఖకు బదిలీ చేశారు. సీఐడీలో అడిషనల్‌‌‌‌ ఎస్పీగా పనిచేస్తున్న జి. బాలస్వామిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కామారెడ్డిలో అడ్మిన్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ ఎస్పీగా పనిచేస్తున్న కోట్ల నర్సింహారెడ్డిని సీఐడీ అడిషనల్‌‌‌‌ ఎస్పీగా, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో అడ్మిన్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ ఎస్పీగా పనిచేస్తున్న జీ.హెచ్‌‌‌‌. రామేశ్వర్‌‌‌‌ను రాచకొండ క్రైమ్స్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ డీసీపీగా బదిలీ చేశారు. 

పోస్టింగ్ కోసం వెయిటింగ్‌‌‌‌లో ఉన్న అడిషనల్‌‌‌‌ ఎస్పీల్లో కె. నరహరిని టీజీ పోలీస్‌‌‌‌ అకాడమీ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా, ఎం.నాగేశ్వర్‌‌‌‌రావును గద్వాల్‌‌‌‌ అడ్మిన్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ ఎస్పీగా, కె.రాంకుమార్‌‌‌‌ను సైబరాబాద్‌‌‌‌ సైబర్‌‌‌‌ క్రైమ్స్‌‌‌‌-1 అడిషనల్‌‌‌‌ డీసీపీగా, బి. శ్రీ కృష్ణగౌడ్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌ సిటీ సౌత్‌‌‌‌ వెస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ డీసీపీగా, కోట్ల వెంకట్​రెడ్డిని టీజీ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ ఎస్పీగా, జి.బిక్షం రెడ్డిని సీఐడీ అడిషనల్‌‌‌‌ఎస్పీగా బదిలీ చేశారు. సీఐడీలో అడిషనల్‌‌‌‌ ఎస్పీగా ఉన్న కె. శేఖర్‌‌‌‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వరంగల్‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ డీసీపీగా ఉన్న బోనాల కిషన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌కో జేఎండీగా బదిలీ అయ్యారు. హైదరాబాద్‌‌‌‌ సిటీ సీసీఎస్‌‌‌‌,ఈఓడబ్ల్యూ-–2 అడిషనల్‌‌‌‌ డీసీపీగా ఉన్న ఎం. సుదర్శన్‌‌‌‌ ను జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌ కార్యాలయానికి బదిలీ చేశారు.