
15వ అంతస్తు బాల్కనీలో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు జయశ్రీ గోపాలన్. ఆమె బెంగళూరులోని మహదేవపురాలో ఉంటున్నారు. సడన్గా ఆమెకు వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినాలనిపించింది. కానీ బజ్జీలు చేసుకోవడం కష్టమనిపించింది.మరేం చేయాలి? వెంటనే ఫోన్ తీసుకుని వాట్సాప్ఓపెన్ చేశారామె. అప్పటికే ‘స్నాక్స్’ గ్రూపులో ఏడు మెసేజ్‌లు ఉన్నాయి. మొదటి మెసేజ్ లో ‘‘ఎనిమిది ప్లేట్ల వేడి వేడి బజ్జీలు రెడీ అవుతున్నాయి. కావాలనుకున్న వాళ్లు మెసేజ్ పెట్టండి” అని ఉంది.
ఓఆరుగురు వెంట వెంటనే మాకు ఓ ప్లేట్ తెచ్చివ్వండి అని సమాధానం ఇచ్చారు. గోపాలన్ కూడా అలానే ఓప్లేట్ ఆర్డర్ చేశారు. 15 నిమిషాల్లో బజ్జీలు గోపాలన్ దగ్గరకు వచ్చాయి. బజ్జీలు చేసింది గోపాలన్అపార్ట్ మెంట్లో ఉంటున్నవాళ్లే. ఇందుకుగానూ ఆ ఇంటావిడ చార్జ్ చేసిన మొత్తం 30 రూపాయలు! బెంగళూరులోని వైట్ ఫీల్డ్, మహదేవపురా, సర్జాపూర్, బన్నెర్ ఘట్టా, హెన్నూరులో వాట్సాప్ తో ‘హోమ్లీ ఫుడ్’ వ్యా పారం నడుస్తోంది. ఒకే అపార్ట్ మెంట్ లోఉండే వాళ్లు, ఇరుగుపొరుగు ఇళ్ల వాళ్లు వాట్సాప్ లోగ్రూపులు క్రియేట్ చేసుకుని ఫుడ్ ను పంచుకుంటున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసే బయటి ఫుడ్ కు ఈరకంగా టాటా చెబుతున్నారు. ఇలా బ్రేక్ ఫాస్ట్ మొదలుకుని లంచ్, స్నాక్స్, డిన్నర్ వరకూ వాట్సాప్ ద్వారా వ్యాపారం నడుస్తోంది. రెండేళ్లలో ఈ బిజినెస్ఐటీ రాజధానిలో బాగా ఊపందుకుంది.
ఫుడీ బడ్డీతోనూ..
కేవలం వాట్సాప్ తోనే కాకుండా ‘ఫుడీబడ్డీ’అనే మరో యాప్ సాయంతోనూ బెంగళూరియన్లు ఫుడ్ ను పంచుకుంటున్నారు. ఈరెండు యాప్స్ లో వ్యా పారం ఒకే సూత్రంపై నడుస్తోంది. అమ్మకందారు ఒక రోజు ముందు ఫుడ్ మెనూను పోస్టు చేస్తారు. కావాల్సిన వాళ్లు ఆర్డర్ చేసి, ఏ సమయానికి కావాలో చెప్తారు. ఆటైంకు సెల్లర్ ఫుడ్ ను ఇచ్చేసి, క్యాష్ తీసుకుంటారు. ఫుడీబడ్జీ యాప్ ఆర్డర్లను తీసుకుంటున్నందుకు సెల్లర్స్ నుంచి కొంత మొత్తం చార్జ్ చేస్తోంది. అవసరమైతే డెలివరీ బాయ్స్ ను కూడా అరేంజ్ చేస్తుంది.