అశ్రునయనాల మధ్య హోంగార్డు రవీందర్ అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య హోంగార్డు రవీందర్ అంత్యక్రియలు

హైదరాబాద్​ : హోంగార్డు రవీందర్ అంత్యక్రియలు చాంద్రాయణగుట్టలోని నల్లవాగు స్మశానవాటికలో పూర్తయ్యాయి. అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు రవీందర్​ అంత్యక్రియలు నిర్వహించారు. చివరిసారి చూసేందుకు రవీందర్​ బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. కన్నీటి వీడ్కోలు పలికారు.

అంతకుముందు.. 

తమ కుటుంబానికి న్యాయం చేయాలని రవీందర్ ​భార్య సంధ్య ఆందోళన చేయడంతో పోలీసు అధికారులు చర్చలు జరిపారు. ఉద్యోగం ఇస్తామని డీసీపీ హామీ ఇవ్వడంతో సంధ్య నిరసన విరమించారు. 

సుదీర్గ చర్చల అనంతరం సంధ్య ఆందోళన విరమించారు. రవీందర్ ​డెడ్​బాడీకి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆమె అంగీకరించారు. తన పిల్లల భవిష్యత్తు కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉస్మానియా మార్చురీలో రవీందర్ డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆ తర్వాత డెడ్​బాడీని ఉప్పుగూడలోని రవీందర్ ఇంటికి తరలించారు పోలీసులు. 

రవీందర్ భార్య సంధ్యకు ఏ ఉద్యోగం ఇస్తారానే దానిపై మాత్రం క్లారిటీ లేదు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత క్లారిటీ రానుంది. పోలీస్​డిపార్ట్ మెంట్ లో కాకుండా వేరే ఎక్కడైనా ఉద్యోగం కల్పించాలని కోరానని సంధ్య చెప్పారు. రవీందర్​భార్యను శనివారం (సెప్టెంబర్​ 9న) సీపీ దగ్గరకు తీసుకెళ్లనున్నారు. ఏ డిపార్ట్​ మెంట్ లో ఉద్యోగం ఇవ్వనున్నారనే విషయం సెప్టెంబర్ 9న తేలనుంది.