సీఏఏ ముస్లీం వ్యతిరేకం కాదు, వెనక్కి తీసుకోం: అమిత్ షా

సీఏఏ ముస్లీం వ్యతిరేకం కాదు, వెనక్కి తీసుకోం: అమిత్ షా

కేంద్ర ప్రభుత్వం ఇటీవల సీఏఏ అమలు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముస్లిం వ్యతిరేక చట్టం అంటూ మండి మండిపడుతున్నారు. ఈ విమర్శలకు హోం మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. CAA ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలను ఖండిచారు. ఇప్పటికే చాలా సార్లు ఈ చట్టం గురించి మాట్లాడానని, దేశంలోని మైనార్టీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం ఉద్దేశమని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముస్లింలు కూడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు అమిత్ షా. అయితే...చట్టంలో పేర్కొన్న విధంగా ఆ మూడు దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించాలన్నదే ముఖ్య లక్ష్యం అని వెల్లడించారు. ఒకవేళ ఆందోళనలు మళ్లీ చెలరేగితే CAA చట్టాన్ని వెనక్కి తీసుకుంటారా అని ప్రశ్నించగా.. వెనక్కి తీసుకునే అవకాశమే లేదని తేల్చి అమిత్ షా గట్టిగా చెప్పారు. 

ఇండియా కూటమి అధికారంలోకి రాగానే CAAని రద్దు చేస్తామని  చెబుతుందని, వాళ్లు అధికారంలోకి రారని వాళ్లకీ తెలుసని జోస్యం చెప్పారు. CAAని బీజేపీయే తీసుకొచ్చింది. నరేంద్ర మోదీ చొరవతోనే ఇది అమల్లోకి వచ్చింది. దీన్ని రద్దు చేయడం అసాధ్యం. దేశవ్యాప్తంగా ఈ చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.