కండ్ల కలక వచ్చిందా.. ఇవే జాగ్రత్తలు

కండ్ల కలక వచ్చిందా.. ఇవే జాగ్రత్తలు

వర్షాకాలం  సీజన్​లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కండ్ల కలక. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయి .  వర్షాల కారణంగా వాతావరణంలో జరిగే మార్పులు దీనికి ప్రధాన కారణ అంటున్నారు. అయితే ఈ ఇన్ఫెక్షన్​కు గురైనా.. ఇంట్లోనే దీనిని తగ్గించుకోవచ్చు అంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 దీర్ఘకాలంగా, అకారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా కండ్లకలక వంటి కంటి ఇన్ఫెక్షన్‌లు పెరుగుతున్నాయి. దీనినే పింక్ కళ్లు అని కూడా పిలుస్తారు. దీని లక్షణాలు ఎరుపు, దురద, నీటితో నిండిన కళ్లు. దీనితో బాధ పడుతున్నవారు ఓవర్ ది కౌంటర్ డ్రాప్స్‌తో స్వీయ వైద్యం చేయవద్దని సలహా ఇస్తున్నారు వైద్యులు.అయితే ఇంట్లోనే సాధారణ నివారణలు పాటిస్తూ.. కండ్లకలకు తగ్గించుకోవచ్చని.. పలు మార్గాలు సూచిస్తున్నారు.

ఎవరైనా కండ్లకలక లక్షణాలలో ఒకదానినైనా గుర్తిస్తే.. వారు వెంటనే సమీపంలోని కళ్ల వైద్యుడిని సంప్రదించాలి. అంతేకానీ.. ఓవర్-ది-కౌంటర్ డ్రాప్స్‌తో స్వీయ వైద్యం చేసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అవి దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయని తెలిపారు.

కండ్ల కలక సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • డాక్టర్ సూచించిన విధంగా కంటి చుక్కలు లేదా లూబ్రికెంట్లను ఉపయోగించండి.
  • ఓవర్-ది-కౌంటర్ ఉత్పత్తులను ఉపయోగించడం అస్సలు మంచిది కాదు.
  •  మీ కళ్లను చేతులతో తాకకండి. చేతులలోని బ్యాక్టిరీయా ఈ సమస్యను మరింత పెంచే అవకాశముంది.
  •  మీ కళ్లను నీళ్లు చిమ్మరిస్తూ.. శుభ్రం చేసుకోండి.
  • ఎక్కువ నీరు తాగుతూ.. హైడ్రేటెడ్​గా ఉండండి.
  • కండ్లకలక సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. 
  • కండ్లకలక ఉన్నవారు ఒంటరిగా జాగ్రత్తలు తీసుకోవాలి
  •  కాంటాక్ట్ లెన్సులు వాడటం మానేయాలి. బయటకు వెళ్లాల్సి వస్తే.. కళ్లకు షేడ్స్ పెట్టుకుని వెళ్లండి.
  •  కండ్లకలక సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోతుంది కాబట్టి కంగారు పడకండి. 
  •  వైద్యుని సూచనలు కచ్చితంగా పాటించండి.
కండ్లకలక సోకితే  కళ్లు నలపడం లేదా చేతులు పెట్టడం చేయరాదు. శుభ్రమైన టిష్యూ పేపర్‌ లేదా చేతి రుమాలుతో కండ్లు తరచూ తుడుచుకోవాలి. నల్లటి అద్దాలు పెట్టుకోవడం ద్వారా నుంచి కొంత ఉపశ మనం పొందవచ్చు. కాంటాక్టు లెన్స్‌ పెట్టుకునేవారు వెంటనే వాటి వాడకం ఆపేయాలి.  బాక్టీరి యాతో సమస్య ఏర్పడితే సరైన మందును తగిన మో తాదులో తీసుకోవాలి. కండ్ల కలకలు నివారించడానికి తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలక ఉన్న వారు వాడిన చేతి గుడ్ల, శరీరం శుభ్రం చేసుకునే గుడ్డ ను ఇతరులు వాడొద్దు. ఇక సొంత వైద్యం చేసుకోకూడదని, ఇతరులకు కరచాలనం ఇవ్వొద్దు. వాడిన టవల్స్, కర్చీఫ్, చద్దర్లు ఇతరులకు ఇవ్వకూడదని, అలాగే లక్షణాలు ఉన్న పిల్లలను స్కూల్‌కి పంపిచవద్దు.  చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి.