వ‌రంగ‌ల్ అర్భ‌న్ లో 450 టీమ్స్ తో ఇంటింటి స‌ర్వే

వ‌రంగ‌ల్ అర్భ‌న్ లో 450 టీమ్స్ తో ఇంటింటి స‌ర్వే

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా : కరోనా వ్యాప్తి కట్టడికి వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లాలో విస్తృత చర్యలు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు జిల్లా క‌లెక్ట‌ర్. శుక్ర‌వారం నగరంలోని రంగంపేట, చార్ బౌళీలో జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ రవీందర్, జీడబ్ల్యూఎంసి కమిషనర్ పర్యటించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన క‌లెక్ట‌ర్..వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో 450 సర్వే బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వ‌హిస్తున్నామ‌ని..15 ప్రాంతాల్లో45 వేల గృహాలలో ఇంటింటి సర్వే చేస్తున్నార‌ని తెలిపారు. ఎంజీఎం ఇసోలేషన్ ఉన్నవారిని గాంధీకి తరలిస్తున్నామ‌ని..కేయు, హరిత కాకతీయ అనంత లక్ష్మి కే ఏంసి పున్నమి రీజనల్ కంటి దవాఖానలో క్వారెంటేయిన్ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పిన క‌లెక్ట‌ర్..మరిన్ని క్వారెంటేయిన్ ల గుర్తింపు కు ఆదేశాలిచ్చామ‌న్నారు.

అలాగే.. 4 ఫైర్ వాహనాల ద్వారా హైపో క్లొరైట్ పిచికారి మరో రెండు వాహనాల ద్వారా పిచికారి చేస్తున్నామ‌ని తెలిపారు క‌మిష‌న‌ర్. లాక్ డౌన్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామ‌ని.. ఇప్పటి వరకు లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై వెయ్యికి పైగా కేసులు నమోదు చేశామ‌ని తెలిపారు సీపీ ర‌వీంద‌ర్. ఫేక్ న్యూస్, వదంతులు అసత్య ప్రచారం.. ఇతరులపై దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు సీపీ