విషమంగా హోంగార్డ్ రమేష్ పరిస్థితి

V6 Velugu Posted on Jun 02, 2021

హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ ముందు ఓవర్ స్పీడ్ లో వెళ్తున్న ఓ కారును ఆపబోయి ఆ వాహనం ఢీకొట్టడంతో రమేష్ అనే హోం గార్డ్ గాయాలపాలయ్యాడు. మంగళవారం ఈ ఘటన జరిగింది. నిందితుడు సరూర్ నగర్ కు చెందిన కరుణ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అతడు ఓ ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడని సమాచారం. కరుణపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో గాయపడిన హోం గార్డ్ రమేశ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిసింది.
 

Tagged accident, LB NAGAR, Treatment, Homeguard Ramesh

Latest Videos

Subscribe Now

More News