రసాయనాల బదులు పంటలకూ హోమియో మందులు

 రసాయనాల బదులు పంటలకూ హోమియో మందులు

మనుషులు, జంతువులకే కాదు పంటలకూ హోమియో మందు మంచి ఫలితాలిస్తోంది. వరి, మిర్చి పంటలకు వచ్చే తెగుళ్ల నివారణలో ప్రధానపాత్ర పోషిస్తోంది. హోమియో మందులు వాడిన మిర్చి రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితిలో మిర్చి పంటకు తామర తెగులు వచ్చి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. ఎన్ని రసాయనిక మందులు పిచికారీ చేసినా నల్లపేను తగ్గడం లేదు. పంటను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అందినకాడికి అప్పులు చేస్తున్నారు. అయినా ఫలితం లేక చివరకు పంటకు నిప్పు పెడుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో హోమియో వైద్యం ఇప్పుడు పత్తిపంటకు ఔధంగా మారింది. తామర పురుగు నుంచి పంటను కాపాడేందుకు సహాయపడుతోందని అంటున్నారు అమేయ కృషి వికాస కేద్రం నిర్వహకులు చిట్టా బాలిరెడ్డి. భువనగిరికి చెందిన బాలిరెడ్డి.. పదమూడేళ్లుగా ప్రయోగాలు చేసి ఈ మందును తయారు చేసినట్లు  చెబుతున్నారు.

రసాయనిక మందుల కన్నా బెటర్

హోమియో మందుతో తామర తెగుల్ని అంతం చేయవచ్చంటున్నారు బాలిరెడ్డి. 75 రూపాయల ఖర్చుతో ఎకరా పంటకు మందు తయారుచేయవచ్చుంటున్నారు. ఈ మందుతో నల్లపేను బెడద పోతుందని, దిగుబడి బాగా వస్తుందంటున్నారు బాలిరెడ్డి. ఎక్కువ ఖర్చుతో మందులు కొని..అప్పుల పాలు కావద్దంటున్నారాయన. బాలిరెడ్డి సూచనల్ని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గొరిజవోలు గుంటపాలెం గ్రామానికి చెందిన కొందరు రైతులు ఇంప్లీమెంట్ చేశారు. హోమియో దుకాణాల్లో దొరకే తూజ, అరేనియా డయోడెమాతో పాటు నైట్రిక్ యాసిడ్‌ను వాడి పంటలను కాపాడుకోగలిగారు. నల్ల తామర పురుగల వల్ల కలిగిన ఆకు ముడత వ్యాప్తి చెందకుండా మందు కట్టడి చేసిందని రైతులు చెబుతున్నారు. రసాయనిక మందులకన్నా హోమియో మెడిసిన్ నల్ల తామర పురుగుల కట్టడికి బాగా పనిచేస్తోందంటున్నారు రైతులు.