
హోండా మోటార్‌సైకిల్ స్కూటర్ ఇండియా హార్నెస్ సీబీ 350, సీబీ350 ఆర్ఎస్ బైకుల కొత్త వెర్షన్లను లాంచ్ చేసింది. మొదటి మోడల్ ధర రూ.2,16,356 కాగా, రెండోదాని ధర రూ.2,19,357 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ ప్రకటించింది. కస్టమర్‌లు బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో ఈ మోటార్‌సైకిళ్లను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. రెండు మోటార్ సైకిళ్లలోని 348.36 సీసీ ఇంజన్ 5,500 ఆర్పీఎం వద్ద 20.78 బీహెచ్పీని, 3,000 ఆర్పీఎం వద్ద 30 ఎన్ఎం టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.