టాలీవుడ్ లో కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. పూర్తిగా కెరీర్ పనిపైనే దృష్టి పెట్టే అతికొద్ది మంది యువ హీరోలలో అక్కినేని నాగ చైతన్య మొదటి వరుసలో ఉంటారు. లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ, తన సింప్లిసిటీతో చైతూ కోట్లాది మంది అభిమానులకు మరింత చేరువవుతున్నాడు. నటనలో వైవిధ్యం చూపిస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చైతు తన సినీ కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
నిజాయతీగా పని చేస్తే..
ఇటీవల ఆయన నటించిన 'తండేల్' చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ ను దాటిన విషయం తెలిసిందే. ఎమోషనల్ నేరేటివ్ తో వచ్చిన ఈ సినిమా చైతు కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. అలానే దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘దూత' చైతు కెరీర్ లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అదిరిపోయే ట్విస్టులు, హై ఎంగేజ్మెంట్ తో ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో జర్నలిస్ట్ సాగర్ పర్మ పాత్రలో చైతన్య మెప్పించాడు.
లేటెస్ట్ గా 'దూత' రిలీజై రెండేళ్లు పూర్తియిన సందర్భంగా నాగచైతన్య చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘నటుడిగా ఒక సృజనాత్మకమైన కథను ఎంచుకొని నిజాయతీగా పని చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ‘దూత'. ఈ సిరీస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.
'వృషకర్మ'పై భారీ అంచనాలు
నాగ చైతన్య ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి పెట్టారు. అదే 'వృషకర్మ' (Vrushakarma). ఇది ఒక ప్రతిష్ఠాత్మకమైన పీరియాడిక్-థ్రిల్లర్ ప్రాజెక్ట్. 'కార్తికేయ 2' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో.. దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 'వృషకర్మ' టైటిల్‌తో ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ క్రియేట్ చేసింది. అత్యద్భుతమైన విజువల్స్, నిర్మాణ విలువలు, కట్టిపడేసే నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని పెంచాయి.
►ALSO READ | Chiru-Venky: మెగా విక్టరీ మాస్ జాతర.. 'మన శంకర వర ప్రసాద్ గారు' సాంగ్ గ్లింప్స్ వైరల్!
ఈ గ్లింప్స్‌లో చైతన్య కొత్త లుక్‌లో, శక్తివంతమైన పాత్రలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోంది. పురాణ ఇతిహాసాల నేపథ్యంతో కూడిన మిస్టరీ అంశాలు ఇందులో ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 'తండేల్', 'దూత' తర్వాత చైతూ నుంచి వస్తున్న ఈ వైవిధ్యమైన చిత్రం కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
