Chiru-Venky: మెగా విక్టరీ మాస్ జాతర.. 'మన శంకర వర ప్రసాద్ గారు' సాంగ్ గ్లింప్స్ వైరల్!

Chiru-Venky: మెగా విక్టరీ మాస్ జాతర.. 'మన శంకర వర ప్రసాద్ గారు' సాంగ్ గ్లింప్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' . ఈ మూవీపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.  'పండగకు వస్తున్నారు' అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన  లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'మీసాల పిల్ల' సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

 మెగా విక్టరీ కాంబో.. ఫైరింగ్ మోడ్!

అయితే లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన కీలక అప్డేట్ ఒకటి అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ చిత్రంలో వెంకటేశ్ ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు.  ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ..  ఈ ఇద్దరు  హీరోలు కలిసి ఆడిపాడే మాస్ సాంగ్ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అభిమానుల అంచనాలను మరింత పెంచేసింది.

మాస్ బీట్...

ఈ గ్లింప్స్‌లో బ్యాక్‌డ్రాప్ విజువల్స్ అన్నీ ఫైరింగ్ మోడ్‌లో, పూర్తి మాస్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. చిరంజీవి, వెంకటేశ్‌లు ఇద్దరూ స్టైలిష్‌గా కలిసి నడుస్తూ, అభిమానులకు 'థంబ్స్ అప్' సింబల్ చూపించడం హైలైట్‌గా నిలిచింది. 'మెగా విక్టరీ మాస్ సాంగ్... షూటింగ్ కొనసాగుతోంది' అంటూ అనిల్ రావిపూడి టీమ్ షేర్ చేసిన ఈ ఇంట్రో గ్లింప్స్ నెట్టింట క్షణాల్లో వైరల్ అయింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ అగ్ర హీరోలు ఒకే ఫ్రేమ్‌లో, అది కూడా మాస్ బీట్ ఉన్న పాటలో కనిపించడం అభిమానుల ఆనందం రెట్టింపు అయింది.. ఈ మెగా విక్టరీ కాంబో సాంగ్ ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

►ALSO READ | Akhil Akkineni: 'లెనిన్' కోసం రిస్క్ తీసుకుంటున్న అఖిల్.. పక్కా మాస్‌తో ఈసారైనా హిట్ కొట్టేనా?

ఈ మూవీలో తమిళ నటుడు వీటీవీ గణేశ్‌, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల - విష్ణు ప్రసాద్‌ల హోమ్ బ్యానర్‌ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.  భీమ్స్ సిసిరోలియో సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుంది . 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. త్వరలోనే అధికారిక విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఈ చిత్రం మరో పెద్ద హిట్‌గా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.