Health Tips : ముఖానికి తేనె పెట్టారంటే.. నిగనిగలాడిపోతారు

Health Tips : ముఖానికి తేనె పెట్టారంటే.. నిగనిగలాడిపోతారు

టీ ప్రొడక్ట్స్ ఎక్కువగా కనిపించే బ్యూ ఇంగ్రెడియెంట్స్ లో తేనె ఒకటి. అయితే ఈ నేచురల్ ఇంగ్రెడియెంట్ తో  ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందం రెట్టింపు అవుతుందని అమెరికాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇనిస్టిట్యూట్ రీసెర్చ్ లో తేలింది. దీనివల్ల చర్మానికి బోలెడు. లాభాలున్నాయని చెప్తున్నారు ఈ స్టడీలో పాల్గొన్న రీసెర్చర్లు. తేనెలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రొటీన్స్, అమైనోయాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. 

  • తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లమేటరీ గుణాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. తేనెని ముఖానికి పట్టించి, దాన్ని చర్మం పూర్తిగా పీల్చుకున్నాక అంటే దాదాపు అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే చర్మకణాలు ఆరోగ్యంగా ఉంటాయి.
  • ముఖానికి తేనె రాసి, ఐస్ క్యూబ్ లో మసాజ్ చేస్తే చర్మంపై గాయాలు తగ్గుతాయి. వాటిపై పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి. కొత్త చర్మకణాలు ఉత్పత్తికి సాయం చేస్తుంది తేనె. చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. 

Also Read :- Health Tips : ఇలాంటి వాటర్ తాగితే.. ఈజీగా బరువు తగ్గుతారు.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

  • చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతుంది తేనె. ఇందులోని యాంటీమైక్రోబయల్ గుణాలు స్కిన్ ఇరిటేషన్ ని తగ్గిస్తాయి. మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చల్ని పోగొడతాయి.
  •  తేనెలోని ఎమోలియెంట్ గుణాలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి.జుట్టు కుదుళ్లకి తేమ అందించి, చిట్లిన జుట్టుని మృదువుగా చేస్తాయి. జుట్టు పెరుగుదలకి సాయం చేస్తాయి. అందుకే వారానికోసారి.. అరకప్పు బియ్యంలో ఒక కప్పు నీళ్లు పోసి 2 గంటలు నానబెట్టాలి. ఆ నీళ్లు వడగట్టి అందులో వేడిచేసిన తేనె కలపాలి. జుట్టుని శుభ్రం చేసుకుని ఆ మిశ్రమాన్ని వెంట్రుకలు, కుదుళ్లకి పట్టించి పావుగంట తర్వాత కడగాలి.