Health Tips : ఇలాంటి వాటర్ తాగితే.. ఈజీగా బరువు తగ్గుతారు.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

Health Tips : ఇలాంటి వాటర్ తాగితే.. ఈజీగా బరువు తగ్గుతారు.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గడానికి ఎక్సర్​సైజ్​తో పాటు డీటాక్స్ ​వాటర్ కూడా తాగడం ముఖ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్​లు. ఈ నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు పదార్థాల్ని బయటకు పంపడమే కాకుండా మెటబాలిజం వేగంగా జరిగేలా చేస్తాయి. ఈ వాటర్​ తాగితే  క్యాలరీలు ఎక్కువ కరిగి, ఈజీగా బరువు తగ్గుతారు. వంట గదిలో ఉండే అల్లం, కీరదోస, తులసి, నిమ్మకాయ, కొన్నిరకాల పండ్లతో ఇంటి దగ్గరే డీటాక్స్ వాటర్​ తయారుచేసుకోవచ్చు. 

కీరదోస, నిమ్మకాయ, పుదీనాతో...

కావాల్సినవి: కీరదోస– సగం ముక్క, నిమ్మకాయ– ఒకటి, పుదీనా ఆకులు– కొన్ని 
తయారీ: కీరదోస, నిమ్మకాయను ముక్కలుగా కోయాలి. పెద్ద గాజు గ్లాస్​లో నీళ్లు తీసుకొని అందులో వీటిని వేయాలి. శుభ్రంగా కడిగిన పుదీనా ఆకుల్ని కూడా వేయాలి. ఆ గ్లాస్​ని రాత్రంతా ఫ్రిజ్​లో పెట్టాలి. అంతే డీటాక్స్ వాటర్ రెడీ. ఈ నీళ్లు తాగితే శరీరంతో పాటు స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. 

అల్లం, పుదీనా, నిమ్మకాయ

కావాల్సినవి: అల్లం ముక్కలు (పొట్టు తీసినవి)–  రెండు, నిమ్మకాయలు– రెండు,  పుదీనా ఆకులు– కొన్ని, హిమాలయన్ సాల్ట్ (రాతి ఉప్పు)– చిటికెడు. 
తయారీ: ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకోవాలి. నిమ్మకాయను రెండు ముక్కలు చేసి అందులో వేయాలి. అల్లం, పుదీనా, హియాలయన్​ సాల్ట్ కూడా వేసి కలపాలి. ఈ నీళ్లు తాగితే మెటబాలిజం బాగా జరుగుతుంది. అల్లంలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు గొంతు ఇన్ఫెక్షన్​ని తగ్గిస్తాయి. 

Also Read :- Health Tips : ముఖానికి తేనె పెట్టారంటే.. నిగనిగలాడిపోతారు

పియర్​, తులసి, నిమ్మకాయతో...

కావాల్సినవి: పియర్​– కొన్ని, ఆరెంజ్ జ్యూస్​– సగం కప్పు, తులసి ఆకులు– నాలుగైదు, నిమ్మకాయ ముక్కలు– రెండు, ఐస్​ వాటర్​– సరిపోను.
తయారీ: ఒక గ్లాస్​లో ఐస్​ వాటర్ తీసుకోవాలి. అందులో  ఆరెంజ్​ జ్యూస్​, పియర్, నిమ్మకాయ ముక్కలు వేయాలి. ఈ గ్లాస్​ని పది గంటలు అలాగే ఉంచితే డీటాక్స్ వాటర్ రెడీ. 

బ్లూ బెర్రీ, నిమ్మకాయతో...

కావాల్సినవి: 

నిమ్మకాయ ముక్కలు– మూడు, బ్లూ బెర్రీలు (కోసినవి)– నాలుగైదు. నీళ్లు– పావు లీటర్​. 
తయారీ: గ్లాస్​లో పావు లీటర్ నీళ్లు తీసుకొని అందులో నిమ్మకాయ, బ్లూ బెర్రీలు ముక్కలు వేయాలి. కొంచెం సేపు అలాగే ఉంచితే డీటాక్స్ వాటర్ తయారవుతుంది. ఈ నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గడంలో సాయపడతాయి. 

పుచ్చకాయ, కీరదోస డ్రింక్

కావాల్సినవి: పుచ్చకాయ​ ముక్కలు– ఒక కప్పు, నిమ్మరసం, ఆరెంజ్​ జ్యూస్​– సగం కప్పు, నిమ్మకాయ- – ఒకటి ఆరెంజ్​ ముక్కలు, కీరదోస ముక్కలు– ఐదు.   
తయారీ: ఒక సీసాలో పుచ్చకాయ ముక్కలు, నిమ్మరసం, ఆరెంజ్​ జ్యూస్​, కీరదోస ముక్కలు వేసి మూత పెట్టాలి. ఈ డీటాక్స్ వాటర్​ని గ్లాసులో పోసి, నిమ్మకాయ, ఆరెంజ్​ ముక్కతో గార్నిష్​ చేసుకోవాలి. 

సోంపు, యాపిల్​ డ్రింక్

కావాల్సినవి: సోంపు గింజలు– కొన్ని, యాపిల్– ఒకటి, నిమ్మకాయ ముక్కలు– ఐదు. నీళ్లు– పావులీటర్.
తయారీ: యాపిల్​ని ముక్కలుగా కోసి గింజలు తీసెయ్యాలి. తర్వాత ఒక సీసాలో నీళ్లు తీసుకుని అందులో యాపిల్ ముక్కలు, సోంపు, నిమ్మకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి.  కొంచెం సేపటికి డీటాక్స్ వాటర్ రెడీ అవుతుంది.