మళ్లీ బాలయ్యతో హనీరోజ్

మళ్లీ బాలయ్యతో హనీరోజ్

సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ చిత్రం ‘వీరసింహారెడ్డి’లో నటించిన హనీరోజ్.. ఈ సినిమాతో చక్కని గుర్తింపును అందుకుంది. ‘మా బావ మనోభావాలు’ పాటతో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది హనీరోజ్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ మొదలు సక్సెస్‌‌ సెలెబ్రేషన్స్ వరకూ ప్రతీ ఈవెంట్‌‌లో స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలిచింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌‌ నుండి అవకాశాలు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్యకు జంటగా మరోసారి ఆమె నటించే చాన్సెస్ కనిపిస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా అనిల్‌‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్‌‌గా కాజల్‌‌తో పాటు పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడిక ఆ పాత్రకు హనీరోజ్‌‌ను తీసుకోబోతున్నట్టు టాక్.

ఇదే నిజమైతే టాలీవుడ్‌‌ రీఎంట్రీ ఆమెకు కలిసొచ్చినట్టే. నిజానికి 2008లోనే ‘ఆలయం’ అనే సినిమాలో నటించిందామె. ఆ తర్వాత 2014లో ‘ఈ వర్షం సాక్షిగా’ చిత్రంతో మళ్లీ వచ్చింది. కానీ నిరాశ తప్పలేదు. దీంతో మలయాళంలో మోహన్‌‌ లాల్‌‌ లాంటి హీరోలకు జంటగా నటించి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. ఇక తెలుగులో సక్సెస్‌‌ కావాలన్న ఆమె కోరిక ‘వీరసింహారెడ్డి’తో నెరవేరింది. టాలీవుడ్‌‌లో సీనియర్‌‌‌‌ హీరోల సినిమాలకు సంబంధించి హీరోయిన్స్ విషయంలో ఓ స్పేస్ ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేస్తూ ఈ సక్సెస్‌‌ జర్నీని ఆమె కొనసాగిస్తుందేమో చూడాలి!