భారత్ నుంచి విమాన రాకపోకలపై హాంకాంగ్ నిషేధం

భారత్ నుంచి విమాన రాకపోకలపై హాంకాంగ్ నిషేధం

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోదవుతుండటంతో హాంకాంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి తమ దేశానికి విమాన రాకపోకలను కొన్నాళ్ల‌పాటు నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి హాంకాంగ్‌ ప్రభుత్వం ప్ర‌క‌ట‌న చేసింది. ఇండియాతో పాటు పాకిస్తాన్ ‌, ఫిలిప్పైన్స్‌ నుంచి కూడా విమాన రాక‌పోక‌ల్ని నిషేధిస్తున్న‌ట్టు తెలిపింది. ఏప్రిల్‌ 20 నుంచి మే 3 వ‌ర‌కు అంటే 14 రోజుల పాటు ఈ మూడు దేశాల నుంచి విమానాలకు అనుమతి రద్దు చేస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఆయా దేశాల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నందున‌.. డిసీజ్‌ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ సూచ‌న‌లతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు హాంకాంగ్‌ ప్రభుత్వం తెలిపింది. ఇప్ప‌టికే భార‌త్ నుంచి విమాన రాక‌పోక‌ల‌పై న్యూజిలాండ్ కూడా నిషేధించింది.