
సూపర్ టైఫూన్రాగస భయంతో చైనా వణికిపోతోంది. సముద్ర అలలు భారీగా ఎగిసిపడుతుండటంతో వాతావరణ శాఖ అలెర్ట్ అయ్యింది. ఈ ఏడాదిలో అతిపెద్ద టైఫూన్ సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చైనా అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు ప్రారంభించింది.
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫాను సూపర్ టైఫూన్ రాగస వస్తుందనే భయంతో ముందస్తుగా హాంకాంగ్ మూతపడింది. బుధవారం (సెప్టెంబర్ 23) ఎగిసిపడుతున్న సముద్రపు అలలను పరిశీలించిన వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది. రాగస భయంతో దక్షిణ చైనా నగరాలను అప్రమత్తం చేశారు. పాఠశాలు, వ్యాపారాలు అన్ని మూసివేశారు. దాదాపు 700 విమానాల రాకపోకలు గురువారం వరకు నిలిపివేశారు.
అధికారులు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరదల సంభవిస్తే ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. వీధుల్లో ఇసుక బస్తాలతో వరదను అడ్డుకునే ఏర్పాట్లు చేశారు.
ప్రజలు నిత్యావసరాలకోసం సూపర్ మార్కెట్లపై ఎగబడ్డారు. భయాందోళనలకు గురై ముందుగా నిత్యావసరాలను కొనిపెట్టుకున్నారు.