
ముంబయిలో సౌండ్ పొల్యూషన్ తగ్గించనీకి కొత్త పద్ధతి
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొత్త మోడల్
ఇంప్లిమెంట్ చేయాలంటూ కేటీఆర్ ట్వీట్..
ఓకే అన్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: చౌరస్తాల్లో గ్రీన్ సిగ్నల్ పడ్డ తర్వాత ముందున్న వెహికల్స్ త్వరగా వెళ్లాలంటూ వెనక ఉన్న వాహనాలు హారన్ కొట్టడం చూస్తుంటాం. దీనివల్ల సౌండ్ పొల్యూషన్ పెరుగుతుంది. చాలా మంది ఇరిటేట్ కూడా అవుతుంటారు. దీన్ని తగ్గించడానికి ముంబైలో పోలీసులు ఓ పద్ధతిని ఫాలో అయ్యారు. సిగ్నల్ పోల్స్‌కు సౌండ్ తీవ్రతను కొలిచే డెసిబుల్ మీటర్స్ ఏర్పాటు చేశారు. దీన్ని టైమర్‌కి లింక్ చేశారు. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు హారన్ మోత వల్ల సౌండ్ తీవ్రత 85 డెసిబుల్స్ దాటితే ఆటోమేటిక్‌గా రెడ్ సిగ్నల్ పడుతుంది. మళ్లీ సెకన్స్ మొదటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇదే విషయాన్ని ‘హంక్ మోర్.. వెయిట్ మోర్ (ఎక్కువ సేపు హారన్ కొడితే..ఎక్కువ సేపు వెయిట్ చేయండి ) ’ అని డిస్‌ప్లే బోర్డులపై కనిపించేలా పెట్టారు. కొన్నిరోజులు పరేషాన్ అయిన వాహనదారులు హారన్ కొడితే ఏం జరుగుతుందో గుర్తించారు. అప్పటినుంచి గ్రీన్ సిగ్నల్ పడే వరకు హారన్ కొట్టకుండా వెయిట్ చేస్తున్నారు. దీంతో ముంబైలో వాహనాల సౌండ్ పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. ఈ ఘనతను 1.54 నిమిషాల వీడియోగా తీసి ముంబై పోలీసులు శుక్రవారం ఉదయం ట్విటర్లో పెట్టారు.
ఫిదా అయిన మంత్రి కేటీఆర్
‘ముంబై మోడల్’ వీడియోను ట్విటర్లో చూసిన మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. వెంటనే రీట్వీట్ చేశారు. ఈ కొత్త పద్ధతితో సిటీలో సౌండ్ పొల్యూషన్‌కు చెక్ చెబుదామని, దీనిపై స్టడీ చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోనూ
ఈ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటూ డీజీపీ, హైదరాబాద్ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు ట్యాగ్ చేశారు. దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ స్పందించారు. డీజీపీతో కో ఆర్డినేట్ చేసుకొని ఖైరతాబాద్ జంక్షన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని చెప్పారు. తన ట్వీట్‌ను జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీకి ట్యాగ్ చేశారు.