EPFO పెన్షన్ స్కీం: వీరికి గుడ్ న్యూస్.. కొత్తగా వచ్చిన మార్పులు ఇవే..

EPFO పెన్షన్ స్కీం: వీరికి గుడ్ న్యూస్..  కొత్తగా వచ్చిన మార్పులు ఇవే..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్తగా PF డబ్బు తీసుకోడానికి లేదా విత్ డ్రా సంబంధించిన రూల్స్ మార్చింది. ఈ  నిబంధనలు 13 అక్టోబర్ 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుల వల్ల డబ్బు లావాదేవీలు చాల ఈజీ  అవుతాయి. 

  EPFO ​​ఎం మార్చింది: PF అలాగే EPS డబ్బు తీసుకోవడానికి (కొంత వరకు మాత్రమే) సంబంధించిన రూల్స్ EPFO మార్చింది. దింతో ఈ రూల్స్ గతంలో కంటే సులభంగా, మరింత డిజిటల్‌గా ఉంటాయి. 

EPS కి సంబంధించిన 5 ముఖ్యమైన మార్పులు:  EPFO ఒక పెద్ద మార్పు చేసింది. ఒక ఉద్యోగి ఉద్యోగం మానేసినా లేదా ఉద్యోగం పోయి  నిరుద్యోగిగా మారినా  36 నెలలు అంటే 3 సంవత్సరాల తర్వాత మాత్రమే EPS డబ్బు తీసుకోవచ్చు. గతంలో ఇందుకు కేవలం 2 నెలలు మాత్రమే ఉండేది.  

కనీస పెన్షన్: ప్రస్తుతం EPS-95 కింద నెలకు కనీస పెన్షన్ రూ. 1,000గా ఉంది. కానీ పార్లమెంటరీ కమిటీ ఈ మొత్తాన్ని పెంచాలని సిఫార్సు చేసిందని చెబుతున్నారు. ఈ నిర్ణయంపై ఇంకా చర్చ జరుగుతున్నప్పటికీ, రాబోయే నెలల్లో కనీస పెన్షన్ పెంపు ప్రకటన రావచ్చని ఆశిస్తున్నారు. 

పెన్షన్  సిస్టం పూర్తిగా డిజిటల్: EPFO, EPS పెన్షనర్ల కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (CPPS)ను మొదలుపెట్టింది. ఈ కొత్త పద్ధతిలో పెన్షనర్లు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) ఎక్కడ జారీ అయినా ఏ బ్యాంక్ బ్రాంచ్ నుండైనా పెన్షన్‌ తీసుకోవచ్చు. దీనివల్ల పెన్షన్  ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ లేకుండా పేమెంట్  త్వరగా, సురక్షితంగా జరుగుతాయి.

అధిక జీతం: కోర్టు తీర్పుల ప్రకారం, ఎక్కువ జీతం ఆధారంగా EPSకు డబ్బు కట్టి అలాగే  EPFO ​అంగీకరించిన ఉద్యోగులు ఇప్పుడు ఎక్కువ పెన్షన్‌కు అర్హులు అని EPFO ​​స్పష్టం చేసింది.  

EPS-95 పథకం  రివ్యూ: EPS-95 పథకంపై  రివ్యూ త్వరలో పూర్తవుతుందని EPFO, కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపాయి. పెన్షన్ ఫార్ములా, డబ్బు కట్టే రేట్లు, ప్రయోజనాలను లెక్కించే పద్ధతులు ఇందులో పరిశీలించనుంది. ఈ రివ్యూ తర్వాత ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు,  పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఈ పథకాన్ని అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. ఈ మార్పులు ఉద్యోగుల మంచి కోసమే అని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.