దీపావళి అమ్మకాలు రికార్డులు బద్దలు : రూ.5 లక్షల కోట్లతో కొత్త చరిత్ర సృష్టించిన జనం

దీపావళి అమ్మకాలు రికార్డులు బద్దలు : రూ.5 లక్షల కోట్లతో కొత్త చరిత్ర సృష్టించిన జనం

దీపావళి.. దీపావళి.. జనం పండుగ చేసుకున్నారు. నిజమే జనం నిజమైన దీపావళి చేసుకున్నారు ఈసారి. డబ్బుల్లేవ్.. డబ్బుల్లేవ్ అంటూనే.. జనం ఎగబడి కొనేశారు. ఏది కావాలంటే అది కొనేశారు.. దీపావళి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అవును.. దీపావళి అమ్మకాలు.. సేల్స్ లో ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. దీపావళి ఐదు రోజుల వేడుకల్లో.. అక్షరాల 5 లక్షల 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అవును.. దీపావళి అమ్మకాల్లోనే 2025 చరిత్ర సృష్టించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కంటే ఈసారి 25 శాతం ఎక్కువగా కొనుగోళ్లు పెరిగినట్లు వ్యాపారులు స్పష్టంగా చెబుతున్నారు.

CAIT.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. టైర్ వన్ నుంచి టైర్ 3 సిటీస్ అంటే.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం వంటి నగరాలు, పట్టణాల్లో జనం తమకు కావాల్సిన వస్తువులను ఎగబడి కొనుగోలు చేసినట్లు ఈ సర్వే వెల్లడించింది. 

బంగారం, వెండి అమ్మకాలు 10 శాతంగా ఉండగా.. FMCG అంటే నిత్యావసరాలు, ప్యాకేజింగ్ ఫుడ్ వాటా 12 శాతంగా ఉంది. ఎలక్ట్రానిక్స్ వస్తువులు అంటే ఏసీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్స్, స్మార్ట్ టీవీలు వంటి వస్తువుల  వాటా 8 శాతంగా ఉంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ అంటే  గ్రైండర్లు, మిక్సీలు, వాషింగ్ మెషీన్స్ వంటి వాటి వాటా 7 శాతంగా ఉంది.

►ALSO READ | Layoffs : టెక్ స్టార్టప్ కంపెనీల్లో 4 వేల ఉద్యోగుల తొలగింపు : అమెరికా తర్వాత మన దేశంలోనే..!

ఇక బంగారం మార్కెట్ రికార్డులు క్రియేట్ చేసింది. ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు 85 వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరగ్గా.. భాయ్ దూజ్ అంటే అన్నా చెల్లెళ్ల పండుగ వరకు.. అంటే అక్టోబర్ 22వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా బంగారం, వెండి, వజ్రాలు వంటి ఆభరణాల అమ్మకాలు లక్ష నుంచి లక్షా 35 వేల కోట్ల వరకు ఉండొచ్చని ఈ సర్వే అంచనా వేసింది. ఇప్పటికే 85 వేల కోట్ల అమ్మకాలు జరిగిపోయాయి అని కూడా స్పష్టం చేయటం విశేషం. 

భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా దీపావళి అమ్మకాలు 5 లక్షల 40 వేల కోట్లకు చేరటం వెనక ఈ కారణాలు ఉన్నాయి. GST తగ్గింపు ప్రచారం బాగా జరిగింది. దీనికితోడు జనంలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది అంట. అప్పు అయినా పర్వాలేదులే అనే ధీమా వచ్చిందంట. 2024లో 7.8 శాతంగా ఉన్న కాన్ఫిడెన్స్ ఇండెక్స్.. ఈ సారి ఏకంగా 8.6 శాతానికి పెరిగింది. కొనుగోలుదారులు లేక వినియోగదారుల కాన్ఫిడెన్స్ ఇండెక్స్ పెరగటం వల్లనే ఈ స్థాయిలో లావాదేవీలు జరిగాయనేది CAIT.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సర్వే తేల్చిపారేసింది. 

ఓవరాల్ గా.. సింపుల్ గా చెప్పాలంటే అప్పు చేసి పప్పు కూడు అయినా పర్వాలేదు.. అప్పు చేసి దర్జా అయినా పర్వాలేదు.. అప్పు తీర్చేద్దాం.. డోంట్ వర్రీ పని అయితే చాలు అన్న కాన్ఫిడెన్స్ జనంలో బాగా పెరిగినట్లు ఈ రికార్డ్ అమ్మకాలు స్పష్టం చేస్తున్నాయి కదా...