
ప్రభాస్ అభిమానులకు దీపావళి సందర్భంగా ముందస్తు ట్రీట్ అందింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం నుంచి మేకర్స్ లేటెస్ట్ గా ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ హై-బడ్జెట్ చిత్రంపై నెలకొన్న భారీ అంచనాలను ఈ తాజా అప్‌డేట్ మరింత పెంచింది.
"పద్మవ్యూహ విజయీ పార్థః" – సైనికుడి శౌర్యం!
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్.. టైటిల్, ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని తారాస్థాయికి చేర్చింది. ప్రస్తుతానికి 'ప్రభాస్ హను' అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతున్న ఈ సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ, మేకర్స్ దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను మాత్రం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. పోస్టర్‌లో హైలైట్ చేసిన సంస్కృత పదాలు, అద్భుతమైన డిజైన్ సినిమా థీమ్‌ను స్పష్టం చేస్తున్నాయి.
'ఆపరేషన్ జెడ్'
పోస్టర్ మధ్యలో ప్రభాస్ షాడో ఇమేజ్ కనిపిస్తోంది. చుట్టూ తుపాకుల నుంచి ఫైరింగ్ అవుతున్న దృశ్యాలు, యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పోస్టర్‌పై ఉన్న సంస్కృత శ్లోకాలు సినిమా నేపథ్యాన్ని సూచిస్తున్నాయి. అందులో ముఖ్యంగా, "అధర్మస్య సమ్ముఖే సః ఛాయాభ్యః సముత్తిష్ఠతి, పద్మవ్యూహ విజయీ పార్థః" అనే పదాలు ఆకట్టుకుంటున్నాయి. దీని అర్థం - "అధర్మాన్ని ఎదుర్కొంటూ అతను నీడల నుంచి లేస్తాడు, పద్మవ్యూహాన్ని ఛేదించిన విజేత అర్జునుడిలా" అని. ఇది సినిమాలో ప్రభాస్ పాత్ర గొప్ప శౌర్యంతో కూడినదని, అతను ఒంటరిగా ఒక బెటాలియన్‌కు సమానమని సూచిస్తుంది. పోస్టర్‌లో 'ఆపరేషన్ జెడ్' అనే లెటర్స్‌ను ప్రత్యేకంగా హైలైట్ చేయడంతో, సినిమా కథాంశం ఏదైనా మిలిటరీ మిషన్ లేదా రహస్య ఆపరేషన్ చుట్టూ తిరుగుతుండవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రభాస్ పుట్టినరోజుకు 'డిక్రిప్షన్' ట్రీట్
ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 కాగా, దానికి ఒక రోజు ముందుగా అక్టోబర్ 22న ఈ సినిమాకు సంబంధించిన 'డిక్రిప్షన్' ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ డిక్రిప్షన్ ద్వారానే టైటిల్, ఫస్ట్ లుక్‌కు సంబంధించిన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా, ఇది పీరియడ్ హిస్టారికల్ ఫిక్షన్ మూవీ అని, భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగే కథాంశంతో రూపొందుతోందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని వస్తున్న వార్తలకు ఈ ప్రీ-లుక్ పోస్టర్ బలం చేకూర్చింది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వి ఎస్మెయిల్ నటిస్తుండగా, సీనియర్ నటులు జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా కమల్ కణ్ణన్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు. టీ-సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ వంటి ఆరు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్ కెరీర్‌లోనే ఇదొక ప్రత్యేకమైన, గర్వించదగిన చిత్రంగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
----------------------
— Mythri Movie Makers (@MythriOfficial) October 20, 2025
पद्मव्यूह विजयी पार्थः
----------------------#PrabhasHanu DECRYPTION BEGINS ON 22.10.25 🔥
Happy Diwali ✨
Rebel Star #Prabhas #Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma… pic.twitter.com/TDUXpaSmZW