2డీజీ డ్రగ్ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది

2డీజీ డ్రగ్ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది

న్యూఢిల్లీ: డీఆర్డీవో రూపొందించిన కొవిడ్ డ్రగ్ 2డీఆక్సీ డీ గ్లూకోజ్ (2డీజీ) ఎంతో ఉపయోగకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. కరోనా వైరస్ మీద పోరులో భారత్ నే గాక మొత్తం ప్రపంచాన్ని ఈ డ్రగ్ కాపాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ ను, ఆక్సీజన్ పై ఆధార పడటాన్ని తగ్గించడంలో 2డీజీ ఇతోధికంగా పని చేస్తుందని హర్ష వర్ధన్ అన్నారు. దీని వల్ల వైరస్ బారి పడిన రోగులు త్వరగా కోలుకుంటారని స్పష్టం చేశారు. కరోనా ట్రీట్ మెంట్ లో కీలకంగా భావిస్తున్న 2డీజీ డ్రగ్ ఫస్ట్ బ్యాచ్ ను హర్ష వర్ధన్ తోపాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విడుదల చేశారు.