వార ఫలాలు (సౌరమానం) 27–11–2022 నుంచి 03–12–2022 వరకు

వార ఫలాలు (సౌరమానం) 27–11–2022 నుంచి 03–12–2022 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20)

ఆదాయం సంతృప్తికరం. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. మీ సేవలకు తగిన గుర్తింపు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు నూతనోత్సాహం, పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగులు  చిక్కులు అధిగమిస్తారు.

వృషభం (ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21 – మే 21)

కార్యక్రమాల్లో అవరోధాలు అధిగమిస్తారు. విద్యార్థులు సత్తా నిరూపించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత  ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనయోగం. పాతస్నేహితులను కలుసుకుంటారు.  వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం, ప్రమోషన్లు దక్కే అవకాశం.

మిథునం (మే 22 – జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22)

నూతన వ్యక్తుల పరిచయం. అనుకోని ప్రయాణాలు. కొన్ని వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.  వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు  పూర్వవైభవం. రాజకీయవేత్తలకు కొత్త పదవులు లభిస్తాయి. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. 

కర్కాటకం (జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23 – జూలై 23)

పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్య కార్యక్రమాల్లో విజయం. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. ఆత్మీయుల ప్రేమానురాగాలు పొందుతారు. వాహనసౌఖ్యం. అదనపు ఆదాయం. విద్యార్థులకు కొత్త అవకాశాలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులు లక్ష్యాల వైపు సాగుతారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం (జూలై 24 – ఆగస్టు 22)

పరపతి పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు విజయవంతం.  ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనసౌఖ్యం. ఆకస్మిక ధనలబ్ధి. విద్యార్థులకు అప్రయత్నంగా అవకాశాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారుల విస్తరణయత్నాలు ముమ్మరం. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి.

కన్య (ఆగస్టు 23 – సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22)

ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకుంటారు. నైపుణ్యం, ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఇంటర్వ్యూలు అందుతాయి. రాబడి ఆశాజనకం. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులు మరింతగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పైస్థాయి పోస్టులు దక్కవచ్చు.

తుల (సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23 – అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22)

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆదాయం ఆశాజనకం. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. దేవాలయాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు సానుకూలమైన కాలం. ఉద్యోగులు సత్తా చాటుకుంటారు.

వృశ్చికం (అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23 – నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22)

ఆదాయం ఆశాజనకమే. కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

ధనుస్సు (నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23 – డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22)

అదనపు ఆదాయం సమకూరి సంతోషంగా గడుపుతారు.స్నేహితులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ఆస్తుల వ్యవహారంలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు.

మకరం (డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23 – జనవరి 22)

కష్టానికి  తగిన ఫలితం ఉండదు. కార్యక్రమాలలో అవాంతరాలు.  ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువులతో విభేదాలు. కొన్ని నిర్ణయాలు పునఃసమీక్షించుకుంటారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి. వ్యాపారులకు కొంత గందరగోళ పరిస్థితి. బాధ్యతలు పెరిగి ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతారు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు.

కుంభం (జనవరి 23 – ఫిబ్రవరి 22)

ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. దేవాలయాలు సందర్శిస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారులు కోరుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

మీనం (ఫిబ్రవరి 23 – మార్చి 20)

అదనపు ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు పైస్థాయి పోస్టులు దక్కించుకుంటారు.

వక్కంతం చంద్రమౌళి, జ్యోతిష్య పండితులు, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 98852 99400