ఎంత స్పీడ్తో కొట్టేసిందో.. ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

ఎంత స్పీడ్తో కొట్టేసిందో.. ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

ముంబై: పూణే-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై, ముంబై నుంచి పూణేకు వెళ్లే దారిలో ఒక స్కోడా కారు ఘోర ప్రమాదంలో నుజ్జునుజ్జయింది. డ్రైవర్ మితిమీరిన వేగంతో కారుపై నియంత్రణ కోల్పోవడంతో.. కారు దూసుకెళ్లి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఓవర్ స్పీడ్లో ఢీ కొట్టడంతో.. ఈ ధాటికి.. డివైడర్ షీట్ నేరుగా కారులోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఘటన జరిగిన వెంటనే ఐఆర్‌బీ బృందాలు, పోలీసులు, అంబులెన్స్‌లతో స్పాట్కు చేరుకున్నారు. బాధితులను.. గాయపడిన ప్రయాణికుడిని బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్స్.. కారు తలుపులు, డివైడర్ షీట్లను కత్తిరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

యాక్సిడెంట్స్కు చాలా కారణాలున్నా వాటిలో ప్రధానమైనవి మాత్రం అతివేగం, నిర్లక్ష్యం. వీటివల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు ఎన్సీఆర్బీ చెప్తోంది. నిర్లక్ష్యం అంటే ఇష్టం వచ్చినట్లు డ్రైవ్​ చేయడం, అజాగ్రత్తగా బండిని నడపడం, ట్రాఫిక్ ​రూల్స్​ పాటించకపోవడం, ఓవర్​టేకింగ్ వంటివి.  వేగం, నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదాల్లో గాయపడిన వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. 

నిజానికి మిగిలిన రోడ్లతో పోలిస్తే హైవేలు బాగుంటాయి. వెడల్పుగా ఉండడంతో పాటు గుంతలు తక్కువ కనిపిస్తాయి. కానీ, వీటి మీదే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. చనిపోయేవాళ్లు కూడా ఎక్కువని ఎన్​సీఆర్​బీ చెప్తోంది. దీన్ని బట్టి.. వేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని తెలుస్తోంది.