
గచ్చిబౌలిలో ఓ హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్ ఓనర్ భూపాల్ రెడ్డి అద్దె కావాలని ఒత్తిడి చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురైన హాస్టల్ నిర్వాహకుడు నారాయణ తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని వినాయకనగర్ లో పీజీ హాస్టల్ ను నిర్వహిస్తున్నాడు నారాయణ . బిల్డింగ్ యజమాని భూపాల్ రెడ్డి తనను చాలా ఇబ్బంది పెడుతున్నాడని సూసైడ్ నోట్ లో రాశాడు మృతుడు నారాయణ. దీంతో యజమానిపై తగిన చర్యలు తీసుకొని.. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని హాస్టల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. నారాయణ కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.