ఫుడ్​లో గాజుముక్కలపై ప్రశ్నించిన హాస్టల్ స్టూడెంట్

ఫుడ్​లో గాజుముక్కలపై ప్రశ్నించిన హాస్టల్ స్టూడెంట్

హైదరాబాద్, వెలుగు: హాస్టల్​లో గాజుముక్కలు పడిన ఫుడ్ పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించిన ఓ అమ్మాయిని చూసి అందరూ ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకోవాలని రిటైర్డ్​ ఐఏఎస్, ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆకునూరి మురళి అన్నారు. అందరూ ప్రశ్నిస్తే సీఎం కేసీఆర్ భయపడరా? అంటూ ఆ అమ్మాయి వీడియోను ట్వీట్ చేశారు. ‘‘ఈ అమ్మాయిని చూసి మనం అందరం నేర్చుకోవాలి ప్రశ్నించే గుణం.. శభాష్ తల్లి! అందరం ఇట్లాగే ప్రశ్నిస్తే కేసీఆర్ భయపడడా? ఈమె వీసీని, సీఎంను ప్రశ్నించింది.

పిల్లల తిండి మీద పడ్డారేంటో.. ఎక్కడ చూసినా ఇవ్వే కథలు. సిగ్గులేని పరిపాలన. తెలంగాణ మోడల్ అంట! దేశం మొత్తానికి ఆదర్శం అంట. పెద్ద జోక్” అని మురళి ట్వీట్ చేశారు. కాగా, హాస్టల్ లో డబ్బులు కడుతున్నా అడిగినంత పెట్టడంలేదని, పైగా గాజుముక్కలు కలిసిన ఫుడ్ ను వండిపెట్టారని వీడియోలో ఓ స్టూడెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తామంతా ఆ ఫుడ్ ను తిన్నామని, తమకు ఏమైనా అయితే వీసీ, సీఎం కేసీఆర్ దే బాధ్యత అని హెచ్చరించింది.