ఇంటి ముందు బండ్లు పెట్టొద్దన్నందుకు కుటుంబంపై హాస్టల్ స్టూడెంట్స్ దాడి

ఇంటి ముందు బండ్లు పెట్టొద్దన్నందుకు కుటుంబంపై హాస్టల్ స్టూడెంట్స్ దాడి

కూకట్​పల్లి, వెలుగు: హాస్టల్​లో ఉండే స్టూడెంట్స్​ తమ ఇంటి ముందు వాహనాలు పార్క్​ చేస్తుండడంతో అభ్యంతరం తెలిపిన ఓ కుటుంబంపై వారంతా కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కేపీహెచ్​బీ కాలనీ ఐదో రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ కాలనీలో ఆంజనేయ బాయ్స్ హాస్టల్​ ఉంది. హాస్టల్​ ఎదురుగా పవన్​నరసింహనాయుడు(33) కుటుంబం నివసిస్తోంది. హాస్టల్​లో ఉంటున్న వారు నిత్యం వీరి ఇంటి గేటు ముందు బైక్​లు పార్క్​ చేస్తున్నారు. 

మంగళవారం రాత్రి ఇలాగే బైక్స్​ పార్క్​ చేయడంతో వాటిని తీసేయాలని ఆ కుటుంబ సభ్యులు కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన హాస్టల్​లో నివసిస్తున్న సుమారు 30 మంది పవన్​నరసింహనాయుడుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.