వర్షాలే లేవంటే నీళ్లు వేస్ట్చేస్తవా?..హోటల్ కు రూ.20 వేల ఫైన్

వర్షాలే లేవంటే నీళ్లు వేస్ట్చేస్తవా?..హోటల్ కు రూ.20 వేల ఫైన్
  • వాటర్​బోర్డు ఎండీకి అడ్డంగా   దొరికిపోయిన ఓనర్​

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ఓ వైపు వర్షాలు కురవక గ్రౌండ్​వాటర్​పడిపోయి నీటి కష్టాలు వెంటాడుతుండగా...ఏకంగా తాగునీళ్లతో హోటల్​కడుగుతూ సాక్షాత్తు వాటర్​బోర్డు ఎండీకే చిక్కాడో వ్యక్తి..దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రూ.20 వేల ఫైన్​వేశారు. జూబ్లీహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్‌‌ 45లో ‘అనగనగా హోటల్‌‌ ఉంది. బుధవారం ఫీల్డ్​విజిట్​లో భాగంగా వాటర్​బోర్డు ఎండీ కె అశోక్‌‌రెడ్డి అటుగా వెళ్తుండగా హోటల్‌‌ ప్రాంగణాన్ని తాగునీళ్లతో శుభ్రం చేయడం గమనించారు. ఇలాంటివి రోజూ జరుగుతోందని, మీరంతా ఏం చేస్తున్నారని అక్కడి అధికారులపై మండిపడ్డారు. వెంటనే హోటల్​ఓనర్​కు నోటీసులు ఇవ్వడంతో పాటు రూ. రూ.20 వేల జరిమానా విధించారు.