హాట్ స్టార్ IPL బంపర్ ఆఫర్

హాట్ స్టార్ IPL బంపర్ ఆఫర్

శనివారం నుంచి IPL ప్రారంభం కానుండగా..పెరిగిన టీవీ చానల్స్ ధరలతో క్రికెట్ ప్యాన్స్ కు కాస్త నిరాశ కలిగింది. అయితే హాట్ స్టార్ ఓ బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. నెట్‌ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియో లాంటి  విదేశీ సంస్థలకు షాకిస్తూ VIP సబ్‌ స్క్రిప్షన్‌ పేరుతో ఓ సరికొత్త ఆఫర్‌ ను తీసుకొచ్చింది. సంవత్సరానికి రూ.365 సబ్‌ స్క్రిప్షన్ తో శనివారం VIP ప్లాన్ ను హాట్‌ స్టార్  ప్రకటించింది. IPL,   ఈ ఏడాది  మేలో జరగనున్న ICC వరల్డ్‌ కప్‌ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ ప్లాన్‌ ను తీసుకొచ్చింది.

ఇందులో IPL 2019 క్రికెట్ మ్యాచ్‌ లు, టీవీ షోలు, సరికొత్త సినిమాలను చూసే వీలుంది. వివో IPL, ICC క్రికెట్ వరల్డ్ కప్, ఫార్ములా 1 వంటి ప్రీమియర్ లీగ్స్ అన్నింటిని ఈ హాట్‌ స్టార్ VIP టారిఫ్ లో చూడవచ్చు . అది కూడా ఏడాదికి రూ.365కి మాత్రమే. అంటే రోజుకు రూ.1 మాత్రమేనన్నమాట.