బీజేపీ నేతల హౌస్​ అరెస్టులు.. కిషన్​ రెడ్డి పర్యటన వేళ ఉద్రిక్తత

బీజేపీ నేతల హౌస్​ అరెస్టులు.. కిషన్​ రెడ్డి పర్యటన వేళ ఉద్రిక్తత

బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్మించిన డబుల్​ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించిన బీజేపీ నేతలను సీఎం కేసీఆర్​ ప్రభుత్వం ఎక్కడికక్కడ అణచివేస్తోంది.  సీనియర్​ నేతలను జులై 20 ఉదయం నుంచే ఎక్కడికక్కడ  హౌస్​ అరెస్ట్​ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎల్బీ నగర్​ నియోజకవర్గంలో డబుల్​ బెడ్రూంల పరిశీలనకు వస్తుండగా...  ఎల్​బీ నగర్​, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్​ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, సీనియర్​ నేత డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత రాంచంద్రరావు,  చేశారు. బాటసింగారంలో ఇళ్ల పరశీలనకు వెళ్లే నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆధిబట్ల, కందుకూరు, మహేశ్వరం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు బీజేపి నేతలను, ముఖ్య కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన కిషన్​రెడ్డి జులై 20న హైదరాబాద్​కు చేరుకున్నారు. తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం డబుల్​ బెడ్రూంలు అని మాయ మాటలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తోందని బీజేపీ నేతలు విమర్శించారు. కట్టిన ఇళ్లను వెంటనే పబ్లిక్​ కి కేటాయించాలని డిమాండ్​ చేస్తున్నారు.