నకిలీ దస్తావేజులతో ఇల్లు తాకట్టు ..ముఠాలోని ప్రధాన నిందితుడు అరెస్ట్ 

నకిలీ దస్తావేజులతో ఇల్లు తాకట్టు ..ముఠాలోని ప్రధాన నిందితుడు అరెస్ట్ 

ఓల్డ్​సిటీ, వెలుగు: నకిలీ దస్తావేజులు సృష్టించి ఓ ఇల్లును తాకట్టు పెట్టిన ముఠాలో ప్రధాన నిందితుడిని బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడకు చెందిన నుస్రత్ బేగం వద్ద నకిలీ దస్తావేజులు పెట్టి మహ్మద్ నుస్రత్ బేగం, బిన్ ఉస్మాన్ మస్కతి, బాసిత్, అలీ జబ్రి, షకీర్ హుస్సేన్ కలిసి రూ. 3 లక్షల నగదు తీసుకున్నారు.

కొద్దిరోజుల తర్వాత వారు అసలు యజమానులు కారని, దస్తావేజులు నకిలీవని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ముఠాలోని ఏ1 షేక్ ఒమర్ అముది (24)ని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఇన్ స్పెక్టర్ ఆర్. దేవేందర్ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నామన్నారు.