ఇంట్లో .. కుండీల్లో మొక్కలు పెంచుతున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

ఇంట్లో .. కుండీల్లో మొక్కలు పెంచుతున్నారా..  తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

ఇష్టంగా మొక్కలు తెచ్చి పెంచుకోవాలనుకుంటాం. కానీ మనం చేసే కొన్ని పొరపాట్లతోనే అని అనుకున్నట్టుగా పెరగవు. అలా కాకుండా ఒక అవగాహనతో మొక్కలు పెంచాలి. ఇంట్లో మొక్కలు ఎలా పెంచాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

 చాలామందికి మొక్కలకు ఎంత వెలుతురు ఉండాలనేదీ తెలియదు. కొంతమంది విపరీతమైన వెలుతురులో పెట్టేస్తే, మరికొందరు చీకట్లో ఉంచుతారు. దానివల్ల మొక్కలు సరిగ్గా పెరగవు మొక్కను బట్టి దానికి ఎంత వెలుతురు అవసరమనేది ఆధారపడి ఉంటుంది. పూలు పూసేవన్నింటికి వీలైనంతవరకూ ఎండ అవసరముంటుంది. సర్సరీలో కోనేటప్పుడు మొక్కల్ని ఎక్కడ పెట్టారో. చూస్తే ఎంత వెలుతురు అవసరం అనేది తెలుస్తుంది.

 

  •  ఒక్కోసారి మొక్కకు అవసరాని కంటే ఎక్కువ నీళ్లు పోస్తాం. కానీ అది పొరపాటు. భూమిలో పాతే మొక్కలకు మట్టి తడిసేలా నీళ్లు పోయాలి. అదే కుండీల్లో అయితే నీళ్లు పోస్తున్నప్పుడు అని కుండీల నుంచి ఇవతలకు వస్తే చాలు. ప్రతి కుండికి అడుగున రంధ్రం ఉంటుంది. దాన్ని గమనించుకుంటూ నీళ్లు పోస్తే ఇబ్బంది ఉండదు.   మొక్కలకు నీళ్లు మాత్రమే పోస్తే చాలదు.మట్టికి కొన్నిరకాల పోషకాలు కూడా అవసరమవుతాయి. అయితే అది మొక్కను బట్టి మారుతాయి కాబట్టి. నిపుణుల సలహాతో సరైన ఎరువులు ఎంచుకుని తెగుళ్లు .. కీటకాలకు కూడా క్రిమిసంహారక మందులు వాడాలి.
  •  కొంతమందికి మొక్కను బట్టి కుండీని ఎంచుకోవాలనే అవగాహన ఉండదు.. చిన్న కుండలో పెద్ద మొక్కను పెంచేస్తుంటారు. దీనికి పరిష్కారం నెలకోసారి కుండీని గమనించుకోవాలి. ఆ మొక్క వేర్లు పైవరకూ లేదా కుండి అడుగున రంధ్రం దాటి బయటకు వచ్చాయా.. లేదా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి కుండీని మార్చుకోవాలి. 
  •  వాతావరణంతో కాలంతో సంబంధం. లేకుండా మొక్కల్ని పెంచడం సరికాదు. అవి కేవలం పెరగడం తప్పపూలు రాకపోవచ్చు. అందుకే పెంచుకునే ముందే అవి ఆ కాలానికి అనువైనవో కావో తెలుసుకోవడం మంచిది.

వెలుగు,లైఫ్​