
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో అత్యధికంగా ఇండ్లు అమ్ముడైన టాప్–2 సిటీల్లో హైదరాబాద్చోటు దక్కించుకుంది. మొదటిస్థానంలో అహ్మదాబాద్ నిలిచింది. కొత్త ప్రాపర్టీల సగటు విలువలు ఈ కాలంలో 7శాతం వరకు పెరిగాయి. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, భౌగోళిక, రాజకీయ సమస్యలు, ఆర్బీఐ రేట్ల పెంపు వంటి వాటి వల్ల ఇండ్ల ధరలు పెరిగాయి. హైదరాబాద్, అహ్మదాబాద్‌తోపాటు మిగతా ఆరు నగరాల్లోనూ ఇండ్ల అమ్మకాలు బాగున్నాయని ప్రాప్‌టైగర్ డాట్కామ్రిపోర్టు తెలిపింది. దీని ప్రకారం..2022 ఏప్రిల్-జూన్ మధ్య అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, పుణేలలో అమ్మకాలు పెరిగాయి. ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పటికీ హోమ్లోన్ల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. ఈ ఎనిమిది సిటీల్లో 2022 క్యూ1లో 70,620 యూనిట్లు అమ్మగా, క్యూ2లో 74,330 యూనిట్లు అమ్ముడయ్యాయి. సీక్వెన్షియల్ గా అహ్మదాబాద్‌లో 30శాతం, హైదరాబాద్‌లో 21శాతం అమ్మకాలు పెరిగాయి. హైదరాబాద్‌లో ఈ ఏడాది క్యూ2లో 7,910 యూనిట్లు, క్యూ1లో 6,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. అహ్మదాబాద్‌లో అమ్మకాలు 5,550 యూనిట్ల నుంచి 7,240 యూనిట్లకు పెరిగాయి.