
స్థలం కొనేటప్పుడు.. ఆకారమే కాదు.. అది ఎత్తుపల్లాలుగా ఉందా.. ఏ దిక్కులో ఎత్తు ఉంది.. ఎటు పల్లం ఉంది.. ఈస్ట్ ఫేసింగ్ లో ఇల్లు కట్టుకోవాలంటే వాస్తు ప్రకారం కిచెన్.. బెడ్ రూం లకు నిర్మించుకోవచ్చా.. అనే విషయాలపై వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్ ఏమంటున్నారో తెలుసుకుందాం. . .
ప్రశ్న: ఇంటికి ఎత్తు పల్లాలు ఉండటం మంచిదేనా?
జవాబు:: ఎత్తుపల్లాలు ఉన్న ఇంటికి రోడ్ ఎటువైపు ఉందో చూడాలి. దక్షిణ, పడమర వైపు ఎత్తు ఉండాలి... ఉత్తరం, తూర్పు వైపు డౌన్ ఉంటే పరవాలేదని వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.
ప్రశ్న:తూర్పు వైపు ప్రధాన ద్వారం ఉండేలా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం. బెడ్ రూమ్, కిచెన్ ఎలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది?
జవాబు: ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కు మాస్టర్ బెడ్ రూం నైరుతిలో... కిచెన్ ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలని వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.