ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్

కూసుమంచి/ ఖమ్మం రూరల్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్ సూచించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూ డెం, ఖమ్మం రూరల్ మండలం ఆరేంపుల గ్రామాల్లో హౌసింగ్  సెక్రటరీ పర్యటించి.. ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణాలను పరిశీలించారు.  

ఇబ్బందులు కలుగుతున్నాయా, ఇసుక సరఫరా, ఇటుకల కొనుగోలు, నిర్మాణ ఖర్చు, బిల్లులు జమ అవుతున్నాయా.. అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారా, బిల్లులు నేరుగా ఖాతాలో పడుతున్నాయా అగిడారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజ, హౌసింగ్ సీడీ భూక్యా శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.