అవీ--ఇవీ : ప్యారిస్​లో చీజ్​ మ్యూజియం

అవీ--ఇవీ : ప్యారిస్​లో చీజ్​ మ్యూజియం

ప్యారిస్​లో మ్యూజియంలకు కొదవ ఉండదు. అక్కడి వీధుల్లో నడుస్తుంటే... ఎక్కడ చూసినా ఏదో ఒక మ్యూజియం కనిపిస్తుంది. అయితే అన్ని మ్యూజియంల్లోకి ఈ మ్యూజియం మాత్రం స్పెషల్​ అని చెప్పాలి. ఆ స్పెషాలిటే ఏంటంటే చీజ్​ కోసం పెట్టిన మ్యూజియం ఇది. 

ఫ్రెంచ్​ రాజధాని ప్యారిస్​లో ఈ నెల జూన్​ 13న ప్రారంభించిన చీజ్​ మ్యూజియం ఏర్పాటు ఏదో అల్లాటప్పాగా జరిగింది కాదు. దీని వెనక పదేండ్లకి పైగా కష్టం ఉంది. ఇలా ఒక మ్యూజియంను ఏర్పాటుచేయాలనే ఆలోచన ‘పెరోల్స్  డెఫ్ఫిన్వా​’ అనే కంపెనీకి వచ్చింది. 2013లో మొదలైన ఈ కంపెనీ ఫౌండర్​ పియర్ర బ్రిస్సన్. చీజ్​ మ్యూజియం ప్రాజెక్ట్​ డెవలప్​మెంట్​కు పదిహేనేండ్లు శ్రమపడ్డాడు. 

ఈయన పుట్టింది బ్యుజోలాయిస్​లో. వీళ్ల కుటుంబం  వైన్​ తయారీ కోసం ద్రాక్ష తోటలు పెంచేది. పియర్ర మాత్రం చీజ్​ మేకింగ్​లో ట్రైనింగ్​ అయ్యాడు. సంప్రదాయ చీజ్​ తయారీని రాబోయే తరాలకు అందించాలనే తపనతో తనలాగే ఆలోచించే ఓ పదిమందితో కలిసి ఇలా ఒక మ్యూజియం  ఏర్పాటుచేశాడు.

స్కూల్​తో మొదలుపెట్టి​

చీజ్​మేకర్​ పియర్రె బ్రిస్సన్​ ​ పదిహేనేండ్ల క్రితం ప్యారిస్​కు వచ్చి ముసీ డు  ఫ్రొమెజె అనే చీజ్​మేకింగ్​ స్కూల్​ మొదలుపెట్టాడు.  ఈ స్కూల్​లో సంప్రదాయ చీజ్​మేకింగ్​ పద్ధతులు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ నెల జూన్​ 13న చీజ్​ మ్యూజియం ఏర్పాటుచేసి 14 వ తేదీ నుంచి విజిటర్ల కోసం తలుపులు తెరిచాడు. ఈ మ్యూజియంకు వచ్చే విజిటర్స్ చీజ్​ గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలతో పాటు అక్కడి అగ్రికల్చర్​ హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు. వర్క్​షాప్స్​ ఉంటాయి. వాటిలో పార్టిసిపేట్​ తయారుచేసిన చీజ్ శాంపిల్​ తీసుకోవచ్చు. మ్యూజియం సెంట్రల్​ ఎగ్జిబిషన్​లో చీజ్​ మేకింగ్ డెమో కూడా ఉంది.

తెలుసుకుంటూ...చరిత్రలోకి​

ఈ మ్యూజియంలోకి అడుగుపెట్టగానే కళ్ల నిండుగా రకరకాల చీజ్​లు కనిపిస్తాయి. ఫ్రాన్స్​ మొత్తంగా దొరికే చీజ్​ వెరైటీలు చూడొచ్చు. ఈ మ్యూజియం నడవాలో ఆవు, మేక, ఆడ గొర్రె వెల్​కం చెప్తాయి. ఒక రకంగా ఇది ఇంటరాక్టివ్​ ఎగ్జిబిషన్​ గ్యాలరీ అని చెప్పొచ్చు. చీజ్​ వెరైటీలను తెలుసుకోవడమే కాకుండా వాటికి సంబంధించిన నాలెడ్జిని కూడా పొందొచ్చు. మ్యూజియం ఏర్పాటు వెనక రెండు ఉద్దేశాలు ఉన్నాయి. 

మ్యూజియంకు వచ్చే విజిటర్స్​కు ఫ్రెంచ్​ వాతావరణం గురించి తెలియచెప్పడంతో పాటు చీజ్​ ఇండస్ట్రీలో కెరీర్​ ఏర్పరచుకోవడం కోసం యువతకు ఉన్న మార్గాలను చెప్పడం.  అలాగే చీజ్​ ఎవరు తయారుచేశారు? ఏ రకం పాలు వాడారు? వంటి ఎన్నో వివరాలు ఉంటాయి. ఇలా తెలియజెప్పే వివరాలను పీడీఓ(ప్రొటెక్టెడ్ డిజిగ్నేషన్ ఆఫ్ ఆరిజిన్ ) అంటారు. ఇక్కడ ఉన్న కియోస్క్​ దగ్గర ఇలాంటి వివరాలు ఇంకా ఎన్నో తెలుస్తాయి . 

ఎడ్యుకేషన్​ టూర్​

చీజ్​ కల్చర్​ దగ్గర నుంచి మాన్యుఫాక్చరింగ్​​ సీక్రెట్స్​తో పాటు రుచి గురించి కూడా తెలుసుకోవచ్చు. యువత, పెద్ద వాళ్లకు సరదా, ఇంటరాక్టివ్​గా చీజ్​ గురించి తెలియచెప్తున్నారు.  ఒక్కమాటలో చెప్పాలంటే ఈ మ్యూజియంలోకి అడుగుపెడితే చీజ్​కి సంబంధించి ఎడ్యుకేషనల్​ టూర్​ అయినట్టే. చీజ్​ గురించి అంతా ఇంతా అని గొప్పలు చెప్పడమే కాకుండా... చీజ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్​ గురించి కూడా చెప్తారు. యువత చీజ్​ మేకింగ్​ ప్రొఫెషన్​లోకి రావాలి. అందుకే ఈ ఇంటరాక్టివ్​, ఎడ్యుకేషనల్​ స్పేస్​ ఎగ్జిబిషన్​లో ఇచ్చాం.

అలాగే సిటీల్లో ఉండే వాళ్లకు, చీజ్​ ఉత్పత్తి చేసే ప్రాంతాలకు మధ్య ఈ మ్యూజియం ఒక లింక్​ కానుంది. వీళ్ల ఏకైక లక్ష్యం మాత్రం కొత్త తరం యువత   చీజ్​ మేకర్స్​ కావాలి.  చీజ్​ మేకింగ్ పరిశ్రమలు ఏర్పాటుచేయాలి. చీజ్​ మేకర్​ కావాలని ఉన్నా లేదా ప్రశాంతంగా రిలాక్స్​ అయ్యి చీజీగా చిల్​ అవుదామనుకున్నా ‘మ్యుజె డు ఫొమజ్​’కి వెళ్లి పోవడమే.

సే చీజ్...జ్​....

‘‘ప్యారిస్​లో వైన్ గురించి​ ప్రమోట్​ చేసేందుకు ఇప్పటికే చాలా వరకు ప్రోగ్రామ్స్​, ఎగ్జిబిషన్స్​ ఆర్గనైజ్​ చేశారు. ఫ్రాన్స్​లో వైన్​ కల్చర్ బాగా డెవలప్ అయ్యింది. అలాగే చీజ్​ అనేది కూడా ఇక్కడ చెప్పుకోదగింది. కానీ ఫ్రాన్స్​ కల్చర్​తో కలిసిపోయిన చీజ్​ గురించి లోతుగా తెలుసుకునేందుకు ప్రత్యేకించి ఎటువంటి ప్లేస్​లు లేవు. మరో విషయం ఏంటంటే కాస్ట్​ ఆఫ్​ లివింగ్(జీవన వ్యయం) అనేది చాలా బర్డెన్​ అయిపోయింది నేటి యువతకు. అదొక్కటే కాదు ఇప్పుడున్న ఆధునిక వర్కింగ్​ రొటీన్​ పట్ల విసుగెత్తి ఉన్నారు.  అలాంటి వాళ్లు తిరిగి పల్లెలకు వచ్చేందుకు ఎంకరేజ్​ చేయాలనే ఉద్దేశం నాది.

నిజానికి సంప్రదాయ పద్ధతిలో చేసిన చీజ్​కు డిమాండ్​ చాలా ఎక్కువగా ఉంది. ఫ్రాన్స్​లో 246 వెరైటీల చీజ్​ రకాలు తయారుచేస్తారు. కానీ అందుకు పనిచేసే వాళ్ల సంఖ్య బాగా తక్కువ. మోడర్న్​ లైఫ్​ స్టయిల్​కు అలవాటు పడిన యువత తిరిగి పల్లెలకు వచ్చి అడ్జస్ట్​ కావడం కష్టంగా అనిపించొచ్చు. కానీ ఒకసారి వచ్చారంటే మాత్రం అది వాళ్లకు చాలా సంతోషకరమైన జీవితానికి కేరాఫ్​ అడ్రెస్​ అవుతుంది. అందుకు నేను గ్యారెంటీ. ఎందుకంటే మంచి చీజ్​ తయారుచేయగలిగిన వ్యక్తి జీవితంలో చాలా బాగా సంపాదించుకోవచ్చు. 


మేం ట్రెడిషనల్​ రైతులతో కలిసి పనిచేస్తున్నాం.  ఎక్కడినుంచో ఇక్కడి వరకు ట్రావెల్​ చేసి వచ్చిన వాళ్లు ఈ చీజ్​ టేస్ట్​ చేసినప్పుడు పల్లెల మూలాల్ని తాకిన అనుభూతి చెందుతారు. అందుకోసం ప్యారిస్​ నగరం నడి మధ్యలో ఒక చిన్న విండో ఈ మ్యూజియం ద్వారా తెరిచాం. చీజ్​ మ్యూజియంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు ఫ్రాన్స్​  గ్రామీణ ప్రాంతాల సంస్కృతి కనిపిస్తుంది.

చీజ్​ మ్యాటర్స్​!

చీజ్​ ఎప్పుడు? ఎలా పుట్టింది అనేది కరెక్ట్​గా తెలియదు. కానీ చీజ్​ తయారైంది మాత్రం అనుకోకుండా జరిగిందనే చెప్పాలి. దానికి సంబంధించి ఒక  కథ కూడా చెప్తుంటారు.  చీజ్​ పుట్టుక అనేది మిడిల్​ ఈస్ట్​ (మధ్య ప్రాచ్యం)లో జరిగింది. అరబ్​ వ్యాపారి ఒకరు ఎడారి గుండా జర్నీ చేసేందుకు గొర్రె పొట్టతో తయారుచేసిన ఒక సంచిలో పాలు నింపుకుని బయల్దేరాడు. 

గొర్రె కడుపు లైనింగ్​ నుండి సహజమైన రెన్నెట్(నెమరువేసే క్షీరదాల పొట్టలో విడుదలయ్యే కొన్ని రకాల ఎంజైమ్స్​)​, సూర్యుడి వేడి కలిసి ఆ పాలు జున్ను, నీళ్లుగా విడిపోయాయి. అతను గమ్యస్థానానికి చేరుకునేలోపు జున్ను తిన్నాడు. అది చాలా రుచిగా అనిపించింది. జున్ను ఆకలి తీరిస్తే, అందులోని నీళ్లు అతని దాహాన్ని తీర్చాయట!  ఏదెలా ఉన్నప్పటికీ చీజ్​ మేకింగ్​ అనేది కనీసం ఏడు వేల సంవత్సరాల క్రితం నాటిదని పోలండ్​, హంగేరీ, స్విట్జర్లాండ్​ల వాసులు చెప్తారు. రకరకాల వంటల్లో  వాడే చీజ్​ లేదా జున్నుకి కొన్ని దేశాల్లో మ్యూజియంలు ఉన్నాయి. అలాంటి మ్యూజియం ఒకటి ఈ మధ్యనే ఫ్రాన్స్​లో మొదలుపెట్టారు. అందులో అడుగుపెడితే చీజ్​ గురించి  లోతైన విషయాలు తెలుస్తాయని దాని నిర్వాహకులు చెప్తున్నారు.
 

ఇదిలా ఉంటే ​ఏకంగా మ్యూజియాలు ఏర్పాటుచేసేంత ఇష్టం ఉన్న చీజ్​ను ఏ దేశాల వాళ్లు ఎక్కువగా తింటారు అనే ప్రశ్న తలెత్తిందా! ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకే  కాబోలు ‘ఇంటర్నేషనల్​ డెయిరీ ఫెడరేషన్’​ వాళ్లు చీజ్​ ఎక్కువగా తినే దేశాల జాబితాను 2023 సంవత్సరానికి గాను విడుదల చేసింది. ఏడాదికి ఎంత చీజ్​ వాడుతున్నాయనే దాన్ని బట్టి వరసగా ఆయా దేశాల పేర్లను విడుదల చేశారు. అవే ఇవి... 

ఫ్రాన్స్​ –  57.9 పౌండ్లు
జర్మనీ –  53.2 పౌండ్లు
గ్జెంబర్గ్​ – 53.2 పౌండ్లు
ఐస్​ల్యాండ్​ – 53.2 పౌండ్లు
గ్రీస్​ – 51.5 పౌండ్లు
ఫిన్లాండ్​ – 49.5 పౌండ్లు
ఇటలీ – 48 పౌండ్లు
స్విట్జర్లాండ్​ – 48 పౌండ్లు
 ఎస్టోనియా – 45.8 పౌండ్లు
 నెదర్లాండ్స్​ – 42.7 పౌండ్లు

అమెరికా కూడా చీజ్​ను  ప్రపంచం మొత్తంగా చూసుకున్నప్పుడు ఎక్కువగానే ఉత్పత్తి చేస్తుంది. కాకపోతే ఏడాదికి ఆ దేశంలో చీజ్​ వాడకం అనేది 34.1 పౌండ్లు మాత్రమే ఉండడం వల్ల అది టాప్​ పది దేశాల జాబితాలోకి చేరలేదు. ఆస్ట్రియా, స్వీడన్​, సైప్రస్​, నార్వే, ఇజ్రాయెల్​ దేశాలతో పోల్చితే వాటికంటే అమెరికాలో వాడకం తక్కువ. 


గ్రేట్​ బ్రిటన్​లో చెద్దార్​ చీజ్​ పూర్వకాలం నుంచి తయారుచేస్తున్నారు. ఒక ఏడాదిలో ఇక్కడ చాలా వెరైటీలు ఉత్పత్తి చేస్తారు కూడా. కానీ వాడకం మాత్రం ఏడాదికి 25.7 పౌండ్లు మాత్రమే. కాకపోతే యునైటెడ్​ స్టేట్స్​లో ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. యూరోపియన్​ దేశాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది. విస్కన్​సిన్​ మిల్క్​ మార్కెటింగ్ బోర్డ్​ లెక్కల ప్రకారం చీజ్​ ఉత్పత్తిలో 11.1 బిలియన్​ పౌండ్లతో లీడ్​లో ఉంది యుఎస్​ . 

ఆ తరువాత జర్మనీ 4.81 పౌండ్లు, ఫ్రాన్స్​ 4.27 బిలియన్లు, ఇటలీ 2.55 బిలియన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే యుఎస్​లో చీజ్​ ఉత్పత్తిలో ముందున్న స్టేట్​ విస్కన్​సిన్​​. అందుకే యుఎస్​ టాప్​ 10 దేశాల జాబితాలోకి రాలేదు. అదే విస్కన్​సిన్​ కానీ ఒక దేశం అయ్యి ఉంటే అది పైన చెప్పుకున్న జాబితాలో  నాలుగో స్థానంలో ఉండేది. అక్కడ​ ఒక్క దగ్గరే చీజ్​ ప్రొడక్షన్​ 2.86 బిలియన్​ పౌండ్స్​ ఉంది.