15 వేల జీతంతో ఎట్ల బతుకుతరు? ఎంపీ ఆర్.కృష్ణయ్య

15 వేల జీతంతో ఎట్ల బతుకుతరు? ఎంపీ ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్​,వెలుగు: ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్​.కృష్ణయ్య ఆరోపించారు. తెలంగాణ మోడల్​ స్కూల్​ ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులు మంగళవారం లక్డికాపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. 

ఆర్. కృష్ణయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. నెలకు రూ.15 వేల జీతంతో ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్తెసరు జీతం కూడా ఆరు నెలలుగా పెండింగ్​లో ఉంటే వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు వేముల రామకృష్ణ , నందగోపాల్, వెంకటేశ్ పాల్గొన్నారు.