- కన్జర్వేటివ్ పబ్లికేషన్స్ సెర్చ్‌లో కనవడ్తలేవు
- పెద్ద బిజినెస్‌లనే ప్రమోట్ చేస్తోందని రిపోర్టు
గూగుల్ కొన్ని వెబ్సైట్లను కావాలనే బ్లాక్‌లిస్టులో పెడుతోందట. సెర్చ్ లిస్టులో కనబడకుండా చేస్తోందట. పబ్లిక్‌లో మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోందట. 2000 సంవత్సరం నుంచే సెర్చింగ్ దిగ్గజం ఇలాంటి పని చేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ రిపోర్టు రెడీ చేసి వెల్లడించింది. గూగుల్ న్యూస్ సెర్చింగ్‌లో కన్జర్వేటివ్ పబ్లికేషన్స్ కనబడకుండా అల్గారిదమ్ సెట్ చేసిందని, రాజకీయంగా పక్షపాతం వహిస్తోందని చెప్పింది. ది యునైటెడ్ వెస్ట్, ది గేట్‌వే పండిత్ లాంటి రైట్‌వింగ్ వెబ్సైట్లు మిగతా సైట్లలానే సెర్చ్ ఇంజిన్‌లో లిస్టయినా గూగుల్ న్యూస్‌లో కనబడటం లేదంది.
అలాగే పెద్ద పెద్ద బిజినెస్మెన్ల కంపెనీలనే సంస్థ బాగా ప్రమోట్ చేస్తోందని, వాళ్లకే పనికొచ్చేలా, వాళ్ల వెబ్సైట్లు బాగా కనబడేలా అల్గారిదమ్‌ను మారుస్తోందని ఆరోపించింది.
చిన్న బిజినెస్‌లకు ఎలాంటి సాయం చేయడం లేదని వివరించింది. ‘ఈబే’ కంపెనీకి ఇలానే సహకరిస్తోందని చెప్పింది. అమెజాన్, ఫేస్బుక్ లాంటి వెబ్సైట్లనూ గూగుల్ బూస్ట్ చేస్తోందని పేర్కొంది. తన ఆరోపణలు కరెక్టని చెప్పేందుకు డక్‌డక్‌గో, గూగుల్ సెర్చ్ ఇంజిన్లలో ఒకేసారి సెర్చ్ చేసి వాటిని ఫొటో తీసి పోస్టు చేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టుపై గూగుల్ స్పందించింది. తాము ట్రాన్స్పరెంట్గా పని చేస్తామని, పనిగట్టుకొని ఎవరినీ ప్రమోట్ చేయమని స్పష్టం చేసింది. ఆ రిపోర్టులో అన్నీ పాతవి, పనికిరాని విషయాలే ఉన్నాయని చెప్పింది. గూగుల్ పాలసీల ప్రకారం పబ్లిషర్ విషయాలు గానీ, ఓనర్షిప్ గురించి గానీ చెప్పని సైట్లనే బ్లాక్ చేస్తామని వివరించింది. ఇదంతా చట్టబద్దంగా ఉంటుందని చెప్పింది. గూగుల్ న్యూస్ పాలసీని పాటించని వెబ్సైట్లు కచ్చితంగా న్యూస్ సెర్చ్ లో కనిపించవని వివరించింది.