
కోజికోడ్ : నిఫా వైరస్ మూలాలను గుర్తించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జీరో పేషెంట్‌ను గుర్తించిన అధికారులు.. అతనికి వైరస్ ఎక్కడ? ఎలా? సోకిందనే దానిపై ఆరా తీస్తున్నారు. పేషెంట్ మొబైల్ లొకేషన్ ఆధారంగా అతడు ఎక్కడెక్కడికి వెళ్లాడనేది పరిశీలిస్తున్నారు. వైరల్ లోడ్ ఎంతుందనేది తెలుసుకునేందుకు సెంట్రల్ టీమ్ గబ్బిలాల నుంచి శాంపిల్స్ సేకరిస్తోంది. రాష్ట్రంలో ఆగస్టు 30న ఓ వ్యక్తి చనిపోయాడు.
Also Raed:-బీఆర్ఎస్లో అసంతృప్తులు ఒక్కటైతున్నరు
ఆ తర్వాత టెస్టుల్లో అతనికి నిఫా వైరస్ సోకిందని తేలింది. అతడిని జీరో పేషెంట్‌గా గుర్తించారు. బాధితుడి నుంచి అతడి కొడుకుకు, బంధువుకు వైరస్ సోకింది. సెప్టెంబర్ 11న నిఫాతో మరో వ్యక్తి చనిపోగా, అతనికి కూడా జీరో పేషెంట్ నుంచే వైరస్ సోకినట్టు గుర్తించారు. కాగా, రాష్ట్రంలో కొత్త కేసులేవీ నమోదు కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ శనివారం తెలిపారు. హైరిస్క్ కాంటాక్ట్ లిస్టులోని 94 మందికి టెస్టు చేయగా, అందరికీ నెగెటివ్ వచ్చిందని చెప్పారు. అయితే ముందుజాగ్రత్తగా కోజికోడ్ మెడికల్ కాలేజీలో 21 మందిని, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ లో ఇద్దరు పిల్లలను ఐసోలేషన్‌లో ఉంచామని పేర్కొన్నారు.