
చంద్రగ్రహణం సూతకాలంప్రారంభమయ్యే సమయం (సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12.58) దగ్గరపడింది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సమయం నుంచి గ్రహణ ప్రభావం మొదలవుతుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. ప్రతి ఒక్కరిపై గ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అసలు ఈ గ్రహణ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది. దోష పరిహారం కోసం ఏం చేయాలి.. వేద పండితులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై చంద్రగ్రహణం అర్థరాత్రి 1:26 గంటలకు ముగుస్తుంది.గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది.. గ్రహణ సూతకాలం మధ్యాహ్నం 12.58 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయం నుంచి గ్రహణ ప్రభావం మొదలవుతుందని పండితులు చెబుతున్నారు.
ఈరోజు ( సెప్టెంబర్ 7) రాత్రికి ఏర్పడే చంద్రగ్రహణం చాలా శక్తి వంతమైనది. గ్రహణం కేవలం 3 గంటల 28 నిమిషాలు మాత్రమే ఉన్నా... ఈ ప్రభావం 40 రోజుల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రహణ నియమాలు పాటించాలి. అనుష్టానం .. జపాలు చేసే వారు కచ్చితంగా పట్టు స్నానం.. విడుపు స్నానం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి.
రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కావున.. అందరూ పడుకోవాలి. దంపతులు సంసారిక వ్యవహారాలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. రేపు ( సెప్టెంబర్ 8) ఇంటిని నీటితో కచ్చితంగా శుద్ది చేసుకోవాలి. గంగా జలం కాని.. పుణ్య నదులు వాటర్ గాని చల్లాలి. ఇవన్నీ అందుబాటులొ లేకపోతే.. ఇంటిని శుద్ది చేసిన తరువాత.. ఇంట్లో ప్రతిమూల పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఆ తరువాతే స్టవ్ వెలిగించాలి.
- ఇంట్లో పూజాది కార్యక్రమాలు ముగించుకొని.. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది
- రాహువుకు..చంద్రునికి ప్రత్యేక పూజలు చేయాలి.
- కేజీం కేజీం పావు చొప్పున బియ్యం.. మినుములు దానం ఇవ్వాలి.
- పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి.
- శనివారం నవగ్రహాల దగ్గర నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.
- పేదలకు అన్నదానం.. తెల్లని వస్త్రాలు దానం చేయాలి.
- బ్రాహ్మణులకు దక్షిణ.. తాంబూలం ఇవ్వాలి.
- బుధవారం వినాయకుడికి గరిక సమర్పించాలి
చంద్రగ్రహణం సమయంలో, రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నమ్ముతారు. ఈసారి, పూర్వాభద్ర నక్షత్రం కింద కుంభ రాశిలో గ్రహణం సంభవిస్తుంది. గ్రహణ ప్రభావం 40 రోజుల పాటు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో రాహువు చాలా బలంగా ఉండి.. నష్టం కలుగజేసే అవకాశాలున్నాయి. అందుకే ప్రతిరోజు శివలింగానికి జలాన్ని ( నీరు) సమర్పించాలి. మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేయాలి.రోజూ దక్షిణామూర్తి స్త్రోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు.