స్టాక్ మార్కెట్ పడిపోయింది.. ఢమాల్ అయ్యింది.. లక్షల కోట్ల జనం డబ్బు ఆవిరి అయ్యింది అంటున్నాం.. నిజమే.. అసలు ఇంతకీ పడిపోయిన మన స్టాక్ మార్కెట్ ఏ పొజిషన్ లో ఉంది ఇప్పుడు.. అమెరికా, జపాన్, ఇతర స్టాక్ మార్కెట్లను పోల్చితే మన స్టాక్ మార్కెట్ పతనం ఏ స్థాయిలో.. ఎంతలో ఉంది అనేది చాలా ఆసక్తిగా మారింది. ఆ వివరాలే వీ6 వెలుగు ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్..
స్టాక్ మార్కెట్ పతనాన్ని ఇలా అంచనా వేస్తారు
- 5 శాతం పతనం అయితే పుల్ బ్యాక్ కింద లెక్కిస్తారు.
- 10 శాతం డౌన్ అయితే కరెక్షన్ కింద పరిగణిస్తారు.
- 20 శాతం ఢమాల్ అయితే బేర్ మార్కెట్ కింద చూస్తారు.
- 30 శాతం పడిపోతే క్రాష్ కింద అంచనా వేస్తారు.
- అదే 50 శాతం స్టాక్ మార్కెట్ పడిపోతే.. అది ఆర్థిక సంక్షోభం.. ఆర్థిక మాంద్యం కింద లెక్కిస్తాం..
మీడియాలో ఎక్కువగా క్రాష్.. కరెక్షన్.. బేర్ అంటూ రాస్తుంటారు.. ఇదంతా తప్పు. 2024, ఆగస్ట్ 5వ తేదీ ఇండియన్ స్టాక్ మార్కెట్ పతనం.. జస్ట్ పుల్ బ్యాక్ కింద మాత్రమే లెక్కించాలి.. చూడాలి. అదే జరిగింది.
ALSO READ | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
ఇక అమెరికా నాస్ డాక్ స్టాక్ మార్కెట్ అయితే 10 శాతం డౌన్ అయ్యి.. కరెక్షన్ లోకి వెళ్లింది. అంటే మన కంటే ఐదు శాతంపైనే అమెరికా పడిపోయింది.
ఇక జపాన్ విషయానికి వస్తే జపాన్ నిక్కీ 20 శాతం పడిపోయి.. బేర్ మార్కెట్ అయ్యింది.. అంటే మన కంటే 15 శాతం పైనే జపాన్ స్టాక్ మార్కెట్ పతనమైంది.