పాన్‌కార్డులో తప్పులతో పాస్‌పోర్టు రిజెక్ట్ అయ్యిందా.. పన్ను శాఖ ఇచ్చిన పరిష్కారం ఇదే..

పాన్‌కార్డులో తప్పులతో పాస్‌పోర్టు రిజెక్ట్ అయ్యిందా.. పన్ను శాఖ ఇచ్చిన పరిష్కారం ఇదే..

పాన్ కార్డు అధికారిక పత్రాల్లో చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, పన్ను రిటర్న్స్ ఫైలింగ్ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా ఇలా ఏ పనికైనా పాన్ తప్పనిసరి. మరి ఆ పాన్ కార్డులోనే వివరాల నమోదులో తప్పిదాలు జరిగితే ఏం చేయాలి. వాటిని ఎలా సవరించుకోవాలి అనే విషయాలు చాలా మందికి తెలియవు. దీంతో వివిధ అధికారిక డాక్యుమెంట్లలో నమోదయ్యే కొన్ని తప్పిదాలు అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. 

ఒక వ్యక్తి తన తండ్రి పాన్ కార్డులో ఇంటిపేరులో చిన్న తప్పు ఉండటంతో పాస్‌పోర్టు పొందటం ఆలస్యంగా మారిందని దానిని సవరించుకోవటానికి మార్గం చెప్పాలంటూ ఎక్స్ వేదికగా ఆదాయపు పన్ను శాఖకు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందిస్తూ సమస్య పరిష్కారానికి పన్ను శాఖ ఎలా పరిష్కారం అందించింది.

పాస్‌పోర్టు ఆలస్యానికి సాధారణ కారణాలు:
* అప్లికేషన్ ఫారంలో తప్పులు లేదా అసంపూర్తిగా ఇచ్చిన సమాచారం.
* పాన్, ఆధార్, పుట్టిన తేదీకి సంబంధిత డాక్యుమెంట్లలో వివరాలు మిస్ మ్యాచ్.
* అడ్రెస్ నిర్ధారణలో లోపాలు.
*క్రిమినల్ కేసుల వల్ల.
* ఒకరికి 2 లేదా ఎక్కువ పాస్‌పోర్టులు ఉండటం.
* పోలీస్ వెరిఫికేషన్ సమస్యలు.
పాన్ కార్డ్ లో సరిగా పేరు లేదా ఇతర వివరాలు లేకపోతే, పాస్‌పోర్ట్ దరఖాస్తు "స్టక్" అవుతుందని గుర్తించాలి. 

పాన్ తప్పులను సరిదిద్దుకునే ప్రక్రియ:
పాన్ డేటాలో తప్పులను సరిచేయటం కోసం "Protean eGov" పోర్టల్ (https://tinpan.proteantech.in/) లో పాన్ సర్వీసెస్ లింక్ ద్వారా "Changes or Correction in existing PAN data" ద్వారా దరఖాస్తు చేయవచ్చు. 

* ముందుగా పాత పాన్ కార్డులోని పేరు నమోదు చేయాలి.
* తరువాత కొత్తగా సరిచేసిన డిటెయిల్స్ సమర్పించాలి.
* ఈకెవైసీ, ఈ-సైన్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తును పూర్తి చేయవచ్చు.
* ఆధార్ వివరాలు ఉపయోగించి డిజిటల్ సంతకంతో ప్రోసెస్ జరుగుతుంది.
* జస్ట్ 2 గంటల్లో ఈ-పాన్ అప్‌డేట్ అందుతుంది.
* కావాలనుకుంటే ఫిజికల్ కార్డును కూడా డెలివరీ పొందవచ్చు.

ఇలా పాన్ కార్డులోని తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా పాస్‌పోర్ట్ దరఖాస్తుల్లో వచ్చే సమస్యలు నివారించవచ్చు. ఇలా పాస్‌పోర్ట్ అప్లికేషన్ పేరు పొరపాటు వంటి చిన్న విషయాలు కూడా అప్లికేషన్ తిరస్కరణకు కారణం కాకుండా నివారించవచ్చు. అందువల్ల ఆర్ధిక, అధికారిక డాక్యుమెంట్లలో పేర్లను తప్పులు లేకుండా సెట్ చేసుకున్నాకే పాస్‌పోర్ట్ దరఖాస్తు చేయడం చాలా ముఖ్యం.