కరోనా చెత్తను ఎలా పడేయాలో తెలుసా..

కరోనా చెత్తను ఎలా పడేయాలో తెలుసా..

కరోనా చెత్తను ఇట్ల పడెయ్యాలె
బయో వేస్టేజ్ వెంటనే డిస్పోజ్ చెయ్యాలె
వీటికోసం స్పెషల్ వెహికల్స్ వాడాలె
అన్ని మున్సిపాలిటీలకు కమిషనర్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్లు, అనుమానితులు ఉండే క్వారంటైన్ సెంటర్లు, క్యాంపులు, ఐసోలేషన్ వార్డులు, శాంపిల్ కలెక్షన్ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్లలో రోజువారీగా పోగయ్యే చెత్తను ఎలా పడెయ్యాలనే విషయంలో మున్సిపల్ డిపార్టుమెంట్ ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. బయో మెడికల్ వేస్టేజ్ మేనేజ్మెంట్ పై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇటీవల ఇచ్చిన గైడ్ లైన్స్ పక్కాగా అమలు చేయాలని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు మున్సిపల్ శాఖ కమిషనర్ ఎన్. సత్యనారాయణ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

ఇలాచేయాలి
హెచ్ఐవీ, స్వైన్ ఫ్లూ వ్యాధుల విషయంలో అమలు చేస్తున్న విధానాన్నే కరోనాపేషెంట్లు, అనుమానితుల బయో మెడికల్ వేస్టేజీ నిర్వహణ విషయంలోనూ చేయాలి.
కరోనాపేషెంట్లు, అనుమానితులు ఉండే అన్నిప్రదేశాల్లో శానిటేషన్ కోసం స్పెషల్ వర్కర్లను నియమించాలి. రోజువారీగా పోగయ్యే బయో వేస్టేజీని వెంట వెంటనే డిస్పోజ్ చేయాలి.
కరోనాపేషెంట్లు ఉండే వార్డుల్లో ఉండే డస్ట్ బిన్ లో డబుల్ కవర్లు వేయాలి. ఎట్టిపరిస్థితుల్లో ఈ చెత్త లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
చెత్తవేసేందుకు, తరలించేందుకు కోవిడ్-19 పేరుతో స్టిక్కర్ ఉండే డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలి. కలర్ డబ్బాలు పెట్టుకుంటే గుర్తించడానికి ఈజీగా ఉంటుంది.
చెత్త తరలించేప్పుడు మధ్యలో ఎక్కడా పెట్టకూడదు. నేరుగా తీసుకెళ్లే వ్యాన్లోకి తరలించాలి. డిస్పోస్ చేయడానికి స్పెషల్ స్టాఫ్ ఉంటారు. వాహనాలను, డస్ట్ బిన్లను ఇతర అవసరాలకు ఉపయోగించవద్దు. వాహనాల లోపల, బయట సోడియం హైపోక్లోరోసైట్ ను రోజూ
స్ప్రే చేయాలి.
కరోనా పేషెంట్లు, అనుమానితులు ఉండే సెంటర్లనుంచి వచ్చే చెత్తను, ఇతర ప్రాంతాల నుంచి సేకరించే చెత్తతో ఎక్కడా కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కరోనా చెత్త ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా డిస్పోజ్ అవుతుందనేది పక్కాగా రికార్డు మెయింటెయిన్ చేయాలి. కరోనా పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించే ల్యాబ్ లలో పోగయ్యే చెత్తతో ఇతర చెత్తను కలపకుండా తరలించి డిస్పోజ్ చేయాలి.
క్వారంటైన్ క్యాంపులు, ఐసోలేషన్ హోమ్స్ లో పోగయ్యే బయోమెడికల్ వేస్టేజీని వేసేందుకు ఉపయోగించే డస్ట్ బిన్లకు సరిపోయే పసుపు
రంగు కవర్లను మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యులు సమకూర్చాలి.

For More News..

టైంపాసుకు రోడ్డెక్కితే.. పట్టేస్తది

అటు కరోనా.. ఇటు అకాల వర్షాలు.. రైతన్నకు కోలుకోలేని దెబ్బ