Watermelon Pizza: పుచ్చకాయ పిజ్జా.. ఆరోగ్యంతోపాటు టేస్టీ కూడా..!

Watermelon Pizza:  పుచ్చకాయ పిజ్జా.. ఆరోగ్యంతోపాటు టేస్టీ కూడా..!

ఎండాకాలంలో సరిపోను నీళ్లు, పోషకాలు అందాలంటే పండ్లు ఎక్కువ తినాలి.  చల్లగా, స్వీట్‌గా, ఇంకా కాస్త వెరైటీగా తినాలనుకుంటే వాటర్ మెలన్ పిజ్జా (పుచ్చకాయ పిజ్జా) పర్ఫెక్ట్ ఛాయిస్.

ఇది చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉండటమే కాదు... శరీరానికి కావలసిన నీటిని, పోషకాలను అందిస్తూ ఇట్టే రీఫ్రెష్ చేస్తుంది. వెరైటీగా పండ్ల ముక్కలతో నోరూరించే పిజ్జా చేసుకొని తింటే టేస్ట్ తో  పాటు ఆరోగ్యం కూడా. ఇంట్లోనే ఈజీగా, కేవలం 10 నిమిషాల్లో నోరూరించే వాటర్ మెలన్ పిజ్జాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సినవి:
వాటర్ మెలన్ పెద్ద ముక్క (అడ్డంగా తరిగి)-ఒకటి
స్ట్రాబెర్రీలు- నాలుగు
బ్లూ బెర్రీలు- సగం కప్పు
అరటిపండు- ఒకటి
తేనె- 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- మూడు టేబుల్స్పూన్లు
పెరుగు-- సగం కప్పు
పుదీనా ఆకులు- ఆరు.

తయారీ:
అరటిపండును చిన్న ముక్కలుగా తరగాలి. గిన్నెలో పెరుగు, తేనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ట్రే మీద వాటర్మాలన్ ముక్క పెట్టి, దాని మీద పెరుగు వేసి స్పూన్తో అంతటా రుద్దాలి. తర్వాత స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, అరటిపండు ముక్కలు వేయాలి. ఆ తరువాత చిన్న ముక్కలుగా కోయాలి. పుదీనా ఆకులతో డెకరేట్ చేస్తే టేస్టీ వాటర్ మెలన్ పిజ్జా రెడీ.

ఆరోగ్య ప్రయోజనాలు:

  • హైడ్రేషన్: పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది, ఇది ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది.
  • పోషకాల గని: రకరకాల పండ్లు వాడటం వల్ల విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి.
  • లో-కలోరీ క్రేవింగ్స్: మైదా, చీజ్ వంటివి ఏవీ ఉండవు కాబట్టి బరువు పెరగాలనే భయం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా హ్యాపీగా తినేయొచ్చు.