మహిళల వరల్డ్ కప్ లో కొత్త విజేత అవతరించనుంది. ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆతిధ్య భారత జట్టుతో పాటు సౌతాఫ్రికా ఫైనల్ కు చేరుకుంది. రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా ఇదే తొలి వరల్డ్ కప్ టైటిల్ అవుతుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఇండియా రెండుసార్లు ఫైనల్లో ఓడిపోయింది. సొంతగడ్డపై ఈ సారి ఎలాగైనా ఫైనల్ గెలవాలని గట్టి పట్టుదలతో కనిపిస్తుంది. 2005, 2017 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వచ్చినా తుది మెట్టుపై బోల్తా పడింది. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరగనుండడంతో ఫ్యాన్స్ ఈ సారి మన మహిళల జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు.
మరోవైపు సౌతాఫ్రికా మహిళా జట్టు తొలిసారి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్లో ఇండియాకు గెలిచి తమపై చోకర్స్ అనే ముద్రను పోగొట్టుకోవాలని చూస్తుంది. వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై భారీ విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జట్టు పటిష్టంగా ఉండడంతో సౌతాఫ్రికా సొంతగడ్డపై ఇండియాజకు షాక్ ఇవ్వాలని చూస్తుంది. రెండు జట్లు పటిష్టంగా కనిపించడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఒక అంచనాకు రావడం కష్టమవుతుంది. మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్.. ఇరు జట్ల స్క్వాడ్, టైమింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫైనల్ మ్యాచ్:
నవీ ముంబై, డివై పాటిల్ స్టేడియం- ఆదివారం (నవంబర్ 2)
టైమింగ్:
మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ 2:30 గంటలకు వేస్తారు.
టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ మూడు వన్డేలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది
లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా యాప్, వెబ్‌సైట్ లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
ఇండియా స్క్వాడ్:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, స్నేహ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, అమంజోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, ఉమా ఛెత్రి, షఫాలీ ఛెత్రి,
సౌతాఫ్రికా స్క్వాడ్:
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, మారిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్తా, నాన్‌కులులెకో మ్లాబా, అన్నరీ డెర్క్‌సెన్, అన్నెకే బోష్, మసాబటా క్లాస్, సునే లూస్, కరాబో మెసో, నో కరాబో మెసోహునే.
►ALSO READ | IND vs AUS: ఫిట్‌నెస్ ఉన్నా చివరి మూడు టీ20లకు హేజల్ వుడ్ దూరం.. అభిషేక్ శర్మ రియాక్షన్ ఇదే!
