ప్రపంచ బిర్యానీ దినోత్సవం ఎలా మొదలైంది.. ఎప్పుడు జరుపుకుంటారు

ప్రపంచ బిర్యానీ దినోత్సవం ఎలా మొదలైంది.. ఎప్పుడు జరుపుకుంటారు

జూలై నెలలోని మొదటి ఆదివారాన్ని ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2022 నుంచి ప్రారంభం అయిన ఈ బిర్యానీ దినోత్సవం.. ఇప్పుడు రెండో ఏడాదిలోకి వచ్చింది. దావత్ బాస్మతి రైస్ ఆధ్వర్యంలో దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. 2023 అంటే ఈ సంవత్సరం మాత్రం జూలై 2వ తేదీన బిర్యానీ దినోత్సవం వచ్చింది. ఆ రోజు ఆదివారంగా ఉంది. సో.. వచ్చే ఆదివారం బిర్యానీ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా బిర్యానీ ప్రేమికులు.. దీన్ని ఆస్వాదించటానికి రెడీ అవుతున్నారు.

LT ఫుడ్స్ , వినియోగదారు ఆహార సంస్థ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ దావత్ బాస్మతి రైస్ ఈ సంవత్సరం కూడా మొదటి ఆదివారమైన జూలై 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిర్యానీ ప్రియుల కోసం ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని అందరితో కలిసి పంచుకోనుంది. ఈ రోజున బిర్యానీ ప్రేమికులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వంత పద్ధతులలో బిర్యానీని ఆస్వాదించడం ద్వారా ఈ ఆదర్శప్రాయమైన వంటకాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని, బిర్యానీ మానియాను కొనసాగించాలని దావత్ బాస్మతి పిలుపునిచ్చింది.

ALSOREAD:వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బిర్యానీ వంటకం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన వంటకంగా నిలిచింది. దీన్ని ఇష్టపడని వారు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ గొప్ప రుచికరమైన వంటకంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానానికి గుర్తుగా ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ 'దావత్ బాస్మతి రైస్' నిర్వహించే ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని ఈ సారి మరింత గ్రాండ్ జరుపేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకు విస్తృతమైన డిజిటల్ ప్రచారాన్ని కూడా చేస్తోంది.

దావత్ రిలీజ్ చేసిన కొత్త ప్రకటన ఉద్యోగి- బాస్ మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. దీన్ని ఆఫీస్ వాతావరణంలో సెటప్ చేయగా.. ఇక్కడ ఉద్యోగి బిర్యానీ చరిత్ర గురించి మాట్లాడతాడు. చివరికి, బాస్ తన టిఫిన్ బిర్యానీని ఉద్యోగితో పంచుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://youtu.be/we4BkhdZGU0